మొదలవుతున్న కొత్త ప్రాజెక్ట్‌లు

లాక్‌డౌన్‌తో 2 నెలలపాటు స్థిరాస్తి రంగం స్తంభించింది. లాక్‌డౌన్‌ 4.0 నుంచి సడలింపులు ఇవ్వడంతో క్రమంగా మార్కెట్‌ గాడిన పడుతోంది....

Updated : 20 Jun 2020 04:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో 2 నెలలపాటు స్థిరాస్తి రంగం స్తంభించింది. లాక్‌డౌన్‌ 4.0 నుంచి సడలింపులు ఇవ్వడంతో క్రమంగా మార్కెట్‌ గాడిన పడుతోంది. ఆగిన పనులు పునఃప్రారంభమయ్యాయి. గతంలో కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. క్రితం వారంలో రెండు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభం కావడం శుభపరిణామంగా పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. బీరంగూడలో 30 ఎకరాల్లో 450కిపైగా విల్లాస్‌ ప్రాజెక్ట్‌కు ఒక సంస్థ గతవారం భూమిపూజ నిర్వహించింది. మరో సంస్థ కొండాపూర్‌లో 4.7 ఎకరాల్లో 480 ప్రీమియం రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ల ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఒక సంస్థ అయితే హామీ పేరుతో ప్రైస్‌ ప్రొటెక్షన్‌ కవర్‌ ప్రకటించింది. మరో సంస్థ.. ఇప్పుడు బుక్‌ చేస్తే జీఎస్‌టీ సున్నా అంటోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని