ఆధునికంగా ఉండేలా..

ఇంటికి ఇదివరకటి కంటే ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు ఇల్లే కార్యాలయం, పాఠశాల. ఇంట్లోనే హోమ్‌ థియేటర్‌, జిమ్‌...

Published : 27 Mar 2021 02:41 IST

కె.రాజేశ్వర్‌, ఉపాధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌

ఇంటికి ఇదివరకటి కంటే ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు ఇల్లే కార్యాలయం, పాఠశాల. ఇంట్లోనే హోమ్‌ థియేటర్‌, జిమ్‌, లాన్‌ ఉండాలని కోరుకుంటున్నారు. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేవారు ఇప్పుడు ఇప్పుడు 2వేల చ.అ ఇంటి కోసం చూస్తున్నారు. పిల్లలకు ట్యూషన్‌, సంగీత పాఠాలు ఇలా ఏదైనా ప్రాంగణంలోనే ఉండాలని భావిస్తున్నారు.  60 నుంచి 70 ఫ్లాట్లు ఉంటే నివాసాల్లో సౌకర్యాలన్నీ కల్పించడం కష్టం. అదే రెండు మూడు ఎకరాల విస్తీర్ణంలో రెండువందల నుంచి మూడు వందల ఇళ్ల వరకు ఉండే గేటెడ్‌ కమ్యూనిటీల్లో కోరుకున్న సదుపాయాలన్నీ ఉంటాయి. వీటి కోసం ప్రత్యేకంగా క్లబ్‌హౌస్‌లు ఉండటంతో డిమాండ్‌ బాగా పెరిగింది.  భద్రతకు ఢోకా లేకపోవడం కూడా మరో కలిసొచ్చే అంశం. ఇతర నగరాలతో పోలిస్తే మన దగ్గర ఇంటి ధరలు తక్కువ ఉండటంతో పాతవి అమ్మేసి కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. ఇంటికి పెరిగిన ప్రాధాన్యంతో ఎప్పటికప్పుడు ఆధునికంగా ఉండేలా చూస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు