బల్దియా భవనాలకు విద్యుత్తు ఖర్చు సున్నా!

జీహెచ్‌ఎంసీకి చెందిన నాలుగు భవనాలు నెట్‌ జీరోను సాధించాయి. ఈ భవనాలపై ఏర్పాటు చేసిన సౌర పలకల ద్వారా విద్యుత్తును కార్యాలయ అవసరాలకు వినియోగించుకొని ఈ

Updated : 20 Nov 2021 06:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీకి చెందిన నాలుగు భవనాలు నెట్‌ జీరోను సాధించాయి. ఈ భవనాలపై ఏర్పాటు చేసిన సౌర పలకల ద్వారా విద్యుత్తును కార్యాలయ అవసరాలకు వినియోగించుకొని ఈ ఏడాది కాలంలో బిల్లులను సున్నాకు తగ్గించుకున్నట్లు అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 34 కార్యాలయాలపై రూ.4.5కోట్ల వ్యయంతో 900 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు ప్లాంట్లను నెలకొల్పగా.. వాటిలో నాలుగు భవనాలు ఈ ఘనత సాధించాయని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి మిగతా అన్ని భవనాలూ సున్నా విద్యుత్తు బిల్లుల లక్ష్యాన్ని చేరుకుంటాయన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని