బిల్డర్‌దే బాధ్యత

బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పూర్తయ్యాక స్థానిక సంస్థల నుంచి నివాసయోగ్య ధ్రువీకరణ పత్రం పొందడం తప్పనిసరి. లేకపోతే కరెంట్‌, నీటి ఛార్జీలు, ఆస్తి పన్నును సాధారణం కంటే అధికంగా వసూలు చేస్తుంటారు. ఇది

Updated : 15 Jan 2022 02:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పూర్తయ్యాక స్థానిక సంస్థల నుంచి నివాసయోగ్య ధ్రువీకరణ పత్రం పొందడం తప్పనిసరి. లేకపోతే కరెంట్‌, నీటి ఛార్జీలు, ఆస్తి పన్నును సాధారణం కంటే అధికంగా వసూలు చేస్తుంటారు. ఇది ఒక్కోచోట ఒక్కోలా ఉంది. ముంబయిలో సమృద్ధి కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకి నివాసయోగ్య ధ్రువీకరణ పత్రం లేదు. ఇదిగో అదిగో అంటూనే పాతికేళ్లు గడిచిపోయాయి. ప్రాజెక్టు చేపట్టిన బిల్డర్‌ నివాస యోగ్య పత్రం సాధించడంలో విఫలమయ్యారు. దీంతో అక్కడి స్థానిక సంస్థలు ఆస్తి పన్నును 25 శాతం అధికంగా, నీటి ఛార్జీలను 50 శాతం అధికంగా కట్టించుకుంటున్నాయి. దీనికి బాధ్యుడు బిల్డర్‌ అని సదరు సొసైటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూద్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌ బొపన్న ధర్మాసనం కీలక ఆదేశాలు వెలువరించింది. నివాస యోగ్య పత్రం లేని కారణంగా ఇంటి యజమానులు అధికంగా ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు వంటివి చెల్లించి ఉంటే ఆ మొత్తాన్ని రిఫండ్‌ చేయాల్సిన బాధ్యత బిల్డర్‌దేనని ఆదేశించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు