మీకు తెలుసా!

కొందరి సంతకం చాలా అందంగా ఉంటే... మరికొందరివి ఏవో పిచ్చిగీతలు రాసినట్లుగా కనిపిస్తాయి. కానీ జపనీయులు చాలా తక్కువ సందర్భాల్లోనే సంతకాలు చేస్తారట.

Updated : 22 May 2022 06:24 IST

మీకు తెలుసా!

సంతకాలకు బదులు స్టాంపులు!

కొందరి సంతకం చాలా అందంగా ఉంటే... మరికొందరివి ఏవో పిచ్చిగీతలు రాసినట్లుగా కనిపిస్తాయి. కానీ జపనీయులు చాలా తక్కువ సందర్భాల్లోనే సంతకాలు చేస్తారట. దానికి బదులుగా తమ పేరుతో తయారుచేసిన సీల్స్‌(స్టాంప్స్‌) వాడతారట. వాటిని జపాన్‌ భాషలో హాంకో లేదా ఇన్‌కా అంటారు. చెక్క, ఇనుము, ప్లాస్టిక్‌తో తయారైన ఈ సీల్స్‌పైన పేర్లను ముద్రించి ఇస్తారట. దాంతో అవసరం వచ్చినప్పుడల్లా సంతకానికి బదులుగా ఎర్రని ఇంకులో ముంచి దాన్ని ఉపయోగిస్తారట.


ఫస్ట్‌... ఫస్ట్‌..!

వేసవి అనగానే నిమ్మకాయ సోడాతో సేదతీరుతుంటాం కదా! ఈ సోడాని 1767లో కనిపెట్టారు జోసఫ్‌ ప్రీస్ట్‌లీ. అన్నట్టు ఆక్సిజన్‌ని కనిపెట్టిన రసాయనశాస్త్రవేత్త కూడా ఈయనే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..