పూల పకోడీ రుచి చూస్తారా..?
ట్రెండీ రుచులు!
ఈ రోజుల్లో నగలూ దుస్తుల్లో వస్తున్నన్ని కొత్త ట్రెండ్లు వంటకాల్లోనూ వస్తున్నాయి. అలాంటివే ఈ ఎమోజీ కేక్ పాప్లూ, ఆరోగ్యాన్ని పెంచే అసై బౌల్స్, పూల పకోడీలూ...
సెనగపిండిలో ఎక్కువ ఉల్లిపాయలూ కరివేపాకూ వేసి చేసే పకోడీల గురించి మనదగ్గర తెలియని వారెవ్వరూ ఉండరు. మరి, మీకు తెలుసా... మన పెరట్లో దొరికే గుమ్మడి, అరటి, మునగ, పారిజాతం, అవిసె లాంటి పువ్వుల తోనూ రుచికరమైన పకోడీలు వేసుకోవచ్చని. ఇదెక్కడి విడ్డూరం... అందంగా ఉంటాయి కాబట్టి ఫొటోల కోసం ఇలా పువ్వులతోనూ పకోడీలు వేసేస్తున్నారని పొరబడుతున్నారేమో... అస్సలు కాదు. రకరకాల పూలతో పకోడీలు వెయ్యడం, వంటలు చెయ్యడం మన దేశంలో ఎప్పట్నుంటో ఉంది. అయితే, ఒడిశా, బెంగాల్, బిహార్... ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం పూల పకోడీలూ వంటకాలూ చేస్తుంటారు. సోషల్‌మీడియా పుణ్యమా అని అవి ఇప్పుడు అంతటా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి ఆరోగ్యానిక్కూడా మంచివట. మామూలు పకోడీలు వేసినట్లే ఈ పూలను సెనగపిండి, బియ్యప్పిండి, గోధుమ పిండి...లాంటి వాటితో కలిపి నూనెలో వేస్తారు. కాకపోతే ఒక్కోరకం పువ్వులకు కాస్త అటూ ఇటూగా రెసిపీ మారుతుంది. యూట్యూబ్‌లో చూసి మీరూ ప్రయత్నించవచ్చు.
ఎమోజీ కేకు పాప్లు!
ఎమోజీలు... వాటి గురించి తెలియని పిల్లలూ పెద్దలూ ఉండరు అనడం అతిశయోక్తి కాదు. మెసేజుల్లో సగం మాటల స్థానంలో అవే ఉంటున్నాయి మరి. అంతగా మన జీవితాల్లో స్థానం సంపాదించేసిన ఎమోజీలకు కేకుల్లో మాత్రం చోటు కల్పించకపోతే ఎలా..? అందుకే, ఇవి కొత్తరకం కేకు పాప్లుగా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రకరకాల ఎమోజీల హావభావాలతో లాలీపాప్‌ల సైజుల్లో తయారుచేసే వీటిని పార్టీల్లో పెడితే అటు చూడ్డానికీ బాగుంటాయి. ఇటు తినడానిక్కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. పిల్లలూ ఎన్ని కావాలంటే అన్ని ఎంచక్కా తినేయొచ్చు. భలే సరదాగా ఉన్నాయి కదూ..
పండ్లు మరింత రుచిగా...
పండ్లు, నట్స్ ఆరోగ్యానికి మంచివి. కానీ స్వీట్లూ స్నాక్స్ తిన్నంత ఇష్టంగా అందరూ వాటిని తినలేరు. ఈ సమస్యకు పరిష్కారంగా వాటిని రుచికరంగా మారుస్తూ తాజాగా ప్రాచుర్యం పొందిన ట్రెండే ‘అసై బౌల్స్’. అసై బెర్రీల నుంచి వచ్చిన పేరే ఇది. దక్షిణ అమెరికాలో దొరికే ఈ పండ్లను ప్యూరీలుగా చేసి, ఆపైన రకరకాల పండ్ల ముక్కలను వేసి దీన్ని తయారుచేస్తారు. అయితే, మనదగ్గర ఆ పండ్లు దొరకవు కాబట్టి వాటి పొడిని బాదం, సోయా పాలల్లో కలిపి, నట్ బటర్ని వేసి, పైన అరటి, మామిడి, ఆపిల్, జామ్, స్ట్రాబెర్రీలాంటి పండ్ల ముక్కలనూ బాదం, పిస్తా, గుమ్మడి, సబ్జా, అవిసె లాంటివాటిని వేసి అసై బౌల్స్‌ని తయారుచేస్తున్నారు. ఈ పండ్ల పౌడర్ లేకపోయినా వేరే పండ్ల స్మూతీలతో కూడా వీటిని చేసుకోవచ్చు. వీటిలో ఉప్పు లేదా తేనెను కలుపుకునీ తినొచ్చు. ఇన్ని రకాల పండ్లూ నట్స్‌ని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పేదేముందీ. చర్మం కూడా యవ్వనంగా కనిపిస్తుందట. ఈ బౌల్స్ చూడ్డానికి ఆకర్షణీయంగా, తినడానికి రుచిగా ఉంటాయి కాబట్టి పిల్లలూ కాదనకుండా తినేస్తారు. ఇంట్లో చేసుకోలేనివాళ్లకు చేసి పంపించే రెస్టరెంట్లూ టేక్ఎవేలు కూడా ఉన్నాయి.
ఈ టైల్స్.. వెరీ‘గుడ్డు’!
గుడ్డుని ఉడకబెట్టుకునీ ఆమ్లెట్ వేసుకునీ తింటాం. ‘మరి, ఆ పెంకుల్ని ఏం చేస్తారూ...’ అంటే ‘ఏముందీ, పడేస్తాం’ అంటాం. కానీ ఇప్పుడు గుడ్డు పెంకులతో చూడచక్కని టైల్స్‌ని తయారుచేస్తున్నారు తెలుసా... దీనివల్ల ఇటు ఆ పెంకుల వల్ల పోగయ్యే లక్షల టన్నుల వ్యర్థాలనూ అటు సెరామిక్ టైల్స్ తయారీలో ఉత్పన్నమయ్యే కాలుష్యాన్నీ కూడా అరికట్టొచ్చట.
ఈ భూమ్మీద గుడ్డులో ఉన్నన్ని పోషకాలు ఇంకెందులోనూ లేవు. అందుకే, రోజుకి రెండు గుడ్లు తింటే కరోనాని సైతం ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి వస్తుందని వైద్యులు చెప్పడంతో ఒకప్పుడు అంతగా ఇష్టపడని వాళ్లు కూడా తినడం మొదలెట్టేశారు. మామూలుగానూ గుడ్డు రుచి తెలిసినవాళ్లు దాన్ని ఎక్కువగానే తింటుంటారు. బేకరీల్లో కేకుల తయారీకీ రెస్టరెంట్లలో రకరకాల వంటలకూ వాడే గుడ్ల సంఖ్య అయితే ఒక్కో చోట రోజుకి వందలూ, వేలల్లో ఉంటుంది. అందుకే, ఏటా ప్రపంచవ్యాప్తంగా 2.5లక్షల మెట్రిక్ టన్నుల గుడ్డు పెంకుల వ్యర్థాలు పోగవుతున్నాయి. నిజానికి ఈ పెంకుల్ని దంతాల క్యాపింగ్కీ ఎముకల చికిత్సకూ కొంతవరకూ వాడుతున్నారు. మిగిలింది వృథాగా చెత్తలో చేరి పురుగుల పుట్టగా మారి, చెడు వాసనలను వెదజ్లడంతో పాటు మండే గుణం గల మీథేన్ వాయువులనూ ఉత్పన్నం చేస్తుంది. మరోపక్క సెరామిక్ టైల్స్ తయారీలో భాగంగా ఏటా 1.8 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉత్పన్నమవుతోంది. ఈ సమస్యలకు-హాంగ్‌కాంగ్‌కి చెందిన ‘ఎలైన్ యాన్ లింగ్ ఎంగ్’ కనిపెట్టిన పరిష్కారమే ‘ఎగ్ టైల్స్’. చూడచక్కగా అచ్చం సెరామిక్ టైల్స్‌లా ఇక్కడ కనిపించే టైల్స్ గుడ్డు పెంకులతో చేసినవే. ఎలైన్ ఆధ్వర్యంలో ‘కారెల్లే’ పేరుతో స్విట్జర్లాండ్‌లోని ‘నేచర్ స్క్వేర్డ్’ కంపెనీ వీటిని తయారుచేస్తోంది. దీనికోసం సిబ్బంది ముందుగా గుడ్డు పెంకుల్ని సేకరించి, శుభ్రపరిచి వాటిని ఇసుక రేణువులంత చిన్నగా చేస్తారు. తరవాత కావల్సిన రంగూ సైజుకి తగ్గట్లూ టైల్స్ తయారీలో వేరు వేరు పద్ధతుల్ని అనుసరిస్తారు. ఉదాహరణకు మట్టి రంగులో ఉన్న టైల్స్కోసం గుడ్డు పెంకుల్ని ఆ రంగులోకి వచ్చేవరకూ బేక్ చేస్తారు. తర్వాత బైండింగ్ పదార్థాన్ని కలిపి టైల్స్గా మార్చి పాలిష్ చేస్తారు.
పర్యావరణ హితంగా...
మూడువేల గుడ్ల పెంకులతో చదరపు మీటరుకి సరిపడా టైల్స్‌ని తయారుచేయొచ్చట. గుడ్డు పెంకుల్లో 90శాతానికి పైగా ఉండే కాల్షియంకార్బొనేట్ కారణంగా ఈ టైల్స్ గట్టిగా కూడా ఉంటాయట. ఇక, ‘సెరామిక్ టైల్స్ వల్ల హానికర కార్బన్ డయాక్సైడ్ విడుదల అయితే బయోసెరామిక్ ఎగ్ టైల్స్ తయారీ సమయంలో పెంకులు డీ కార్బొనేటింగ్ ఫిల్టర్‌గా పనిచేసి కార్బన్డయాక్సైడ్ని గ్రహిస్తాయి. దీనివల్ల కాలుష్యం మరింత తగ్గుతుంది’ అంటుంది ఈ టైల్స్ ఆవిష్కర్త ఎలైన్. ఎగ్టైల్స్ సహజంగానే అతినీలలోహిత కిరణాలను నిరోధిస్తాయట. పెంకులు రంగుల్ని బాగా శోషించుకోవడం వల్ల విభిన్నమైన వర్ణాల్లో టైల్స్‌ని తయారుచేసి, కొత్తందాలను సృష్టించే అవకాశముంటుంది. తక్కువ బరువుతో పాటు, చాలా పలుచగా చేసే అవకాశం ఉండడంతో గోడలకు అతికించేందుకు ఎక్కువ సౌకర్యంగానూ ఉంటాయట. వీటితో, టీపాయ్లూ, స్టూల్స్, క్యాండిల్ హోల్డర్లు, ట్రేల్లాంటి వాటినీ తయారుచేస్తున్నారు. గొప్ప విషయమే కదూ..!
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Yanamala: దోచుకున్న ప్రతి రూపాయీ ప్రజలు కక్కిస్తారు: యనమల
-
Business News
Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!
-
India News
LPG price: వంటగ్యాస్ మంట.. ఏడాదిలో రూ.244 పెంపు
-
Movies News
Chiranjeevi: చిరు పేరు మార్పు.. న్యూమరాలజీనా? లేదా టీమ్ తప్పిదమా?
-
Sports News
Aravinda de Silva : క్రికెట్ వృద్ధి కోసం.. టీ20 లీగ్‌లపై భారత్ పట్టు సడలించాలి: లంక మాజీ క్రికెటర్
-
Crime News
Andhra News: మైనర్ల డ్రైవింగ్.. తెనాలిలో కారు బీభత్సం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు