Updated : 11 Jul 2021 02:05 IST

చిట్టి చిట్టి పిజ్జాలే కొత్త ట్రెండ్‌!

పిజ్జా... ఆ పేరు వినగానే ప్లేటు సైజులో ఉండే గుండ్రని పిజ్జానే గుర్తుకొచ్చేది ఇన్నాళ్లూ. కానీ ఇప్పుడలా కాదు. బిస్కెట్‌లా మినీ సైజులోనూ కప్‌కేకులా ముద్దొచ్చేవీ... ఇంకా రోల్స్‌లా మఫిన్స్‌లా ఎన్నో రకాల్లో వచ్చేస్తున్నాయి.

‘వావ్‌ పిజ్జా... యమ్మీ యమ్మీ...’ అంటూ దాన్ని చూస్తూనే పిల్లల కళ్లు పెద్దవైపోతాయి. పెదవులు చప్పరించేస్తాయి. ఇక, కుర్రకారు సంగతైతే చెప్పనక్కర్లేదు. పిజ్జా తినాలనిపిస్తే చాలు, సమయం సందర్భం చూడరు. అర్ధరాత్రి అయినా తెప్పించుకుని లాగించేస్తారు. అందరికీ అదంటే అంత ఫేవరెట్‌ కాబట్టే... పిజ్జాలను ఇంట్లో చెయ్యడం కూడా ఈమధ్య సాధారణం అయిపోయింది. ఇక, కరోనా కారణంగా బయటి ఫుడ్‌ తినాలంటే భయపడడంతో పాటు, తీరిక సమయమూ దొరకడంతో పిజ్జాలను పకోడీలూ సమోసాలూ చేసినట్లు తరచూ చెయ్యడం మొదలుపెట్టేశారు. అందులో భాగంగానే దాన్లో కొత్త కొత్త వెరైటీలూ ట్రెండ్‌లు కూడా పుట్టుకొచ్చేశాయి. మామూలుగా పిజ్జా అంటే పెద్ద సైజులో ఉంటుంది. దాన్నే నాలుగైదు ముక్కలుగా కోసి, తలో ముక్కా తీసుకుంటారు. కానీ, పెద్ద పెద్ద ముక్కల్ని తినడం అంత సౌకర్యంగా ఉండదు. పైగా ఒకటి తింటే సరిపోకపోవచ్చు. రెండోది తిందామంటే ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు మళ్లీ చిన్న ముక్కల్ని కొయ్యాలి. అదే పిజ్జాలు కూడా బిస్కెట్‌లానూ కప్‌ కేకులానూ చిన్న చిన్నగా ఉంటే తినడానికి మరింత సౌకర్యంగా ఉంటాయి కదా... పైగా స్నాక్సులా ఎన్ని కావాలంటే అన్నే తీసుకోవచ్చు. పిల్లలకూ వీటిని తినడం సులభంగా ఉంటుంది.

రోల్స్‌లానూ...
మినీ పిజ్జాల ట్రెండ్‌ని ఎవరు మొదలు పెట్టారో కానీ సోషల్‌ మీడియా పుణ్యమా అని ఇవి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌ అయి నోరూరిస్తున్నాయి. కొన్ని బేకరీలూ వీటి అమ్మకాన్ని మొదలుపెట్టాయి.

పార్టీల్లో ఫింగర్‌ ఫుడ్స్‌లానూ మినీ పిజ్జాలను పెడుతున్నారు. ఇక, వీటి తయారీ కూడా ఇంచుమించు మామూలు పిజ్జాల్లానే ఉంటుంది. కాకపోతే, పిజ్జా బేస్‌ని పెద్దగా కాకుండా బిస్కెట్ల సైజులో చేసి, ఆ పైన సాస్‌, పెప్పరోని, చీజ్‌లనూ క్యాప్సికం, టొమాటో ముక్కలనూ పెట్టి బేక్‌ చేస్తారు. కప్‌ కేకుల్లా తయారు చెయ్యాలంటే కప్‌ కేకు మౌల్డుల్లో పిజ్జా బేస్‌ని వేసి, ఆ పైన టాపింగ్స్‌ని అలంకరించి ఒవెన్‌లో పెడతారు. ఇంకాస్త కొత్త రుచుల్లో కావాలనుకునేవారికోసం టాపింగ్స్‌ని పిజ్జా బేస్‌ మీద అమర్చాక ఆ మొత్తాన్నీ కలిపి రోల్స్‌లా చుట్టి చిన్న ముక్కలుగా కత్తిరించి బేక్‌ చెయ్యడం లేదా నూనెలో వేయించడం మరో పద్ధతి. సమోసాల్లో ఉల్లిపాయ ఆలూ కూర్చినట్లు పిజ్జా టాపింగ్స్‌ని పెట్టి నూనెలో వేయించేవాటినీ పిజ్జా రోల్స్‌ అనే అంటున్నారు. ఏమైనా ఈ మినీ పిజ్జాలు చూడ్డానికీ బాగున్నాయి కదూ..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని