30 ఏళ్లు ఆగాల్సిందే!

స్విగ్గీలోనో,  జొమాటోలోనో ఏదైనా ఆర్డర్‌ ఇస్తే... మనం ఎంత సేపు ఎదురుచూస్తాం? అరగంట... మహా అయితే గంట. కానీ, ఏదైనా ఆర్డర్‌ ఇస్తే- ‘30 ఏళ్లలోగా మీరు అడిగింది డెలివరీ చేస్తాం’ అంటే ఎలా ఉంటుంది?

Published : 03 Dec 2022 23:56 IST

30 ఏళ్లు ఆగాల్సిందే!

స్విగ్గీలోనో,  జొమాటోలోనో ఏదైనా ఆర్డర్‌ ఇస్తే... మనం ఎంత సేపు ఎదురుచూస్తాం? అరగంట... మహా అయితే గంట. కానీ, ఏదైనా ఆర్డర్‌ ఇస్తే- ‘30 ఏళ్లలోగా మీరు అడిగింది డెలివరీ చేస్తాం’ అంటే ఎలా ఉంటుంది? జపాన్‌లోని టకాసాగో నగరంలో అసహియా ఫ్యామిలీ షాప్‌లో అమ్మే క్రుకెట్స్‌ కావాలంటే మాత్రం అన్నేళ్లు ఎదురుచూడాల్సిందే. బంగాళాదుంపలూ ఒకరకం పశుమాంసం కలిపి తయారుచేసే వాటికి రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచే లోకల్‌గా మంచి డిమాండ్‌ ఉంది. ఇరవై ఏళ్ల క్రితం వాటి రుచి గురించి బయట ప్రపంచానికి తెలియడంతో ఆర్డర్లు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పటి నుంచి ఆ వంటకాన్ని రుచి చూడాలనుకునే వారికి సంవత్సరాల తరబడి వెయిటింగ్‌ తప్పడం లేదు. ‘2013లో ఆర్డర్‌ చేస్తే క్రుకెట్స్‌ ఇప్పుడు మా ఇంటికి చేరాయి’ అంటూ మొన్నీమధ్య ఓ జపాన్‌ మహిళ ట్వీట్‌ చేయడంతో అవి నెట్‌లో సెన్సేషన్‌ అయ్యాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..