Published : 12 Sep 2021 01:33 IST

పక్షవాతానికి వీడియోగేమ్స్‌తో...

క్షవాతం వచ్చిన వాళ్లకి చేతులూ కాళ్లూ కాస్త చచ్చుబడిపోతాయి. దాంతో చికిత్స తీసుకున్నాక అవి మళ్లీ మామూలు స్థితికి రావడానికి సమయం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో చేతుల్లో పటుత్వం పెంచేందుకు గ్రిపేబుల్‌ అనే వీడియో గేమ్‌ను రూపొందించారు లండన్‌కు చెందిన ఇంపీరియల్‌ కాలేజ్‌ నిపుణులు. వ్యాధి సోకిన చేతితో ఈ పరికరాన్ని పట్టుకుని నొక్కుతూ ఆప్‌ ద్వారా సంబంధిత వీడియో గేమ్‌ ఆడటం వల్ల కండరాలు శక్తిని పుంజుకుంటాయట. అలా పట్టుకున్నప్పుడు- ఈ పరికరం చేతిలోని ప్రతి కండరం కదలికనీ పసిగట్టి కంపనం ద్వారా రోగికి తెలిసేలా చేస్తుంది. సాధారణంగా ఈ రకమైన వ్యాయామాన్ని రీహాబిలిటేషన్‌ సెంటర్లలోనే చేయిస్తారు. కానీ వీళ్లు దీన్ని ఎవరికి వాళ్లు ఇంట్లో చేసుకునేలా డిజైన్‌ చేశారు. సంప్రదాయ థెరపీ కన్నా ఈ వ్యాయామం వల్ల చేయి త్వరగా శక్తిని పుంజుకుందట. పైగా ఆడుతూ వ్యాయామం చేయడం వల్ల రోగులు మానసికంగానూ ఆనందంగా ఉన్నారట.


కొవిడ్‌కు సరైన చికిత్స!

ప్పటికప్పుడు కొత్త వేరియంట్స్‌తో వస్తోన్న కొవిడ్‌ వైరస్‌ను ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్‌తోపాటు అందుకు తగ్గ రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం అన్నది తెలిసిందే. అయితే వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన నిపుణులు కొవిడ్‌ వేరియంట్స్‌ అన్నింటినీ తట్టుకునే యాంటీబాడీని తొలిసారిగా గుర్తించారు. ప్రస్తుతం దాన్ని ఎదుర్కోవడానికి ఇస్తోన్న యాంటీబాడీలన్నీ కొన్నిరకాల వేరియంట్లనే నిరోధిస్తున్నాయి. కానీ సార్స్‌కోవ్‌-2 వైరస్‌ అసలు మూలాన్ని నాశనం చేయలేకపోతున్నాయి. అందుకే ఎలుకల్లో దాన్ని నియంత్రించేందుకు 43 రకాల యాంటీబాడీల్ని ప్రయోగించి, అందులో ఏది దాని సమూలంగా నాశనం చేస్తుందో గమనించారట. అందులో సార్స్‌2- 38 అనే యాంటీబాడీ అన్ని రకాల వేరియంట్లనీ సమర్థంగా నాశనం చేయగలిగినట్లు గుర్తించారు. దీని ఆధారంగా త్వరలోనే మరింత మేలైన చికిత్సను అందుబాటులోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు.


కలల నిద్రలో...

నిషికి నిద్ర ఎంతో కీలకం అనేది తెలిసిందే. అందులోనూ కలలు వచ్చే గాఢ నిద్ర (రెమ్‌ స్లీమ్‌) మరీ ముఖ్యం అంటున్నారు సుకుబా యూనివర్సిటీ నిపుణులు. ఎందుకంటే ఆ సమయంలో మెదడులో రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుందనీ దానివల్ల న్యూరాన్లలో పేరుకున్న హానికర కలుషితాలు బయటకు పోతాయనీ చెబుతున్నారు. గాఢ నిద్ర, మగత నిద్ర, మెలకువ స్థితిలో ఉన్నప్పుడూ మెదడులో రక్తప్రసరణ వేగం ఎలా ఉంటుందనే విషయాన్ని రకరకాలుగా పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టమైంది. అదే మగత నిద్రకీ మెలకువ స్థితికీ పెద్ద తేడా లేదట. అంతేకాదు, ఎలుకలు- గాఢనిద్రలో ఉన్నప్పుడు వాటిని మేలుకునేలా చేసి అవి మళ్లీ గాఢ నిద్రలోకి వెళ్లినప్పుడూ పరిశీలించారట. అప్పుడు కూడా రక్త ప్రసారం వేగంగానే జరిగిందట. అదే గాఢ నిద్ర తగ్గితే రక్తప్రసరణలో వేగం తగ్గిపోతుందనీ దాంతో ఆల్జీమర్స్‌, వచ్చే ప్రమాదం ఉందనీ అంటున్నారు.


కొందరితోనే స్నేహం ఎందుకంటే...

కొందరిని చూసిన వెంటనే స్నేహం చేయాలనిపిస్తుంది. ఇష్టం ఏర్పడుతుంది. కానీ కొందరిని చూస్తే అలా అనిపించదు. ఎంతకాలం కలిసి ఉన్నా సయోధ్య కుదరదు. దీనికి కారణం జన్యువులే అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన నిపుణులు. దాదాపుగా ఒకే రకమైన జన్యుక్రమం ఉన్నవాళ్లను చూసినప్పుడు మెదడులోకి ప్రసరించే ఎంజైమ్‌లకీ వేర్వేరు జన్యువులు ఉన్నవాళ్లను చూసినప్పుడు స్రవించే ఎంజైమ్‌లకీ తేడా ఉన్నట్లు గుర్తించారు. అదెలా అంటే- కొన్ని ఎలుకల్ని ఎంపికచేసి వాటికి కొత్తవాటిని పరిచయం చేసి, ఎమ్మారై స్కాన్‌ ద్వారా మెదడులోకి స్రవించే ఎంజైమ్‌లను పరిశీలించారట. ఆ తరవాత అవి వేటితో స్నేహంగా ఉంటున్నాయో గమనించి, వాటి జన్యుక్రమం ఎలా ఉందో సరిచూశారట. అందులో ఒకే రకమైన జన్యుక్రమం ఉన్న ఎలుకలకి మాత్రమే చూసిన వెంటనే స్నేహం కుదిరిందట. అంతేకాదు, జన్యువుల్లో తేడా ఎక్కువగా ఉన్న ఎలుకల్ని చూసినప్పుడు మెదడులో స్రవించే ఎంజైమ్‌లూ వేరుగా ఉన్నాయట. అందుకే చూసినవెంటనే వాటితో స్నేహం కుదరలేదు అని భావిస్తున్నారు. మనుషుల్లో కూడా ఇలాగే జరుగుతుందనీ ఈ న్యూరో బయాలజీ ఆధారంగానే వాళ్ల సామాజిక బంధాలు ఉంటాయనీ విశ్లేషిస్తున్నారు. ఒకే మనస్తత్వం ఉన్నవాళ్లు స్నేహితులు అయ్యేది ఇందుకేనేమో!


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని