ఆ చిట్టి గుండెల చప్పుడు మహేశ్‌బాబు!
అమ్మాయిల మనసుల్లో కలల రాకుమారుడు... సూపర్‌స్టార్‌గా అభిమాన ధనమున్న శ్రీమంతుడు మహేశ్‌బాబు రీల్‌లైఫ్‌లోనే కాదు రియల్‌లైఫ్‌లోనూ హీరోనే. పేద చిన్నారులకు ఆపరేషన్లు చేయిస్తూ వారి చిట్టి గుండెకు ఊపిరులూదుతున్నాడు. ఇప్పటి వరకూ 1300ల మందికిపైనే కొత్త జీవితాన్ని ప్రసాదించిన మహేశ్‌బాబు సేవా కార్యక్రమాలన్నింటినీ దగ్గరుండి చూసుకుంటున్న ఆయన భార్య నమ్రత వాటి గురించి ఏం చెబుతున్నారంటే....
డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది. కానీ సాయం చేసే గుణం కొందరికే ఉంటుంది. ఈ రెండూ ఉన్న వారు చాలా తక్కువ మంది. మహేశ్ ఆ కోవకే చెందుతారు. అందుకే పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాటన్నింట్లో- చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్లు చేయించడం, వారంతా కోలుకుని సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లడం మాకెంతో సంతృప్తినిస్తోంది. మేం ఇవన్నీ చేయడం వెనక బలమైన కారణమే ఉంది. చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న మహేశ్‌కి పిల్లలంటే ఎంతిష్టమో. మా పిల్లలైనా, బయటి వారైనా అంతే ఆప్యాయంగా ఉంటారు. మా గౌతమ్ కడుపులో ఉన్నప్పుడు ఎంతో ఎగ్జైటింగ్‌గా బేబీ కోసం ఎదురుచూసేవారాయన. కానీ, వాడు డెలివరీ డేటు కంటే ఆరువారాలు ముందే పుట్టాడు. అప్పుడు సరిగ్గా అరచేయంతే ఉన్నాడు. వాడిని దగ్గరకు తీసుకుని హత్తుకోలేకపోయాం. నియోనేటల్ కేర్‌లో ఉంచి 15 రోజులు చికిత్స చేశారు. దాదాపు మూడు నెలలకి మామూలయ్యాడు. అప్పటి వరకూ వాడి ఆరోగ్యం గురించి ఎంతో భయపడ్డాం. ఆ తరవాత ‘మన దగ్గర డబ్బుంది కాబట్టి సరిపోయింది. అదే లేనివాళ్లకి¨ ఇలా జరిగితే వాళ్ల పరిస్థితి ఏంటీ...’ అంటూ మహేశ్ బాధపడేవారు. మనం అలాంటి వారికి తప్పకుండా ఏదైనా చేద్దాం అని తరచూ అంటుండేవారు. అప్పుడప్పుడూ మా దృష్టికి వచ్చిన వారికి ఏదో ఒక సాయం చేస్తుండేవాళ్లం. అయితే 2015లో ‘శ్రీమంతుడు’ విడుదలయ్యాక అనుకోకుండా కృష్ణగారి సొంతూరు బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాల్ని దత్తత తీసుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్ని మొదలుపెట్టాం. అక్కడ వైద్యశిబిరాలు కూడా ఏర్పాటు చేస్తుండేవాళ్లం. అప్పుడే ‘శ్రీమంతుడు’ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని విజయవాడ ఆంధ్రా హాస్పిటల్ వాళ్లు చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేస్తున్నారనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. ఆయన చొరవతోనే, ఆ హాస్పిటల్ డైరెక్టర్ మమ్మల్ని కలిసి- ఒక్క ఆంధ్రాలోనే ఏడాదికి దాదాపు 10,000 మంది పిల్లలు గుండెలో రంధ్రంతో పుడుతున్నారనీ, ఆ సమస్యని గుర్తించక కొందరూ, గుర్తించినా చికిత్సకు స్తోమత లేక మరికొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పడంతో ఎంతో బాధపడ్డాం. పుట్టుకతో వచ్చే ఆ సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించాలని అప్పుడే నిర్ణయించుకుని ఆ ఆసుపత్రితో ఒప్పందం చేసుకున్నాం.
మహేశ్‌బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకూ దాదాపు 1300ల మందికిపైనే చిన్నారులకు ఆపరేషన్లు విజయవంతంగా చేయించాం. పిల్లలు ఆసుపత్రికి వచ్చింది మొదలుకొని చికిత్స జరిగి పూర్తిగా కోలుకునే వరకూ మాదే బాధ్యత. ఒకవేళ పిల్లల సమస్య మరీ తీవ్రంగా ఉంటే విదేశాల నుంచి ప్రత్యేకంగా వైద్యుల్ని పిలిపించి ఆపరేషన్ చేయిస్తాం. వారి ఖర్చునూ మేమే భరిస్తాం. మా ఫౌండేషన్ ద్వారా చికిత్స చేయించుకోవాలనుకున్న వారు మహేశ్‌బాబు అభిమాన సంఘం ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ప్రతి జిల్లాలోని మహేశ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దగ్గర మా ఎంబీ ఫౌండేషన్ నంబర్లు ఉన్నాయి. వారి ద్వారానే- మా దృష్టికొచ్చిన పిల్లల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితి గురించి ప్రాథమిక స్థాయిలో ఆరా తీసి ఆంధ్రా హాస్పిటల్‌కి పంపుతాం. అప్పట్నుంచీ- పిల్లలు పూర్తిగా కోలుకునే వరకూ- ఆసుపత్రి వాళ్లే ఫాలోఅప్ చేస్తారు. అలా కొందరికి ఐదు వేల రూపాయలతోనే నయమైతే మరికొందరికి ఐదులక్షలరూపాయలు కూడా అవుతుంది. ఈ మధ్య అనుకోకుండా ముప్ఫై మంది పిల్లలకు ఒకేరోజు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అయినా సరే ఆసుపత్రి సిబ్బంది అందుకు తగిన ఏర్పాట్లు చేసి అన్నీ విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు ఆ పిల్లలంతా డిశ్ఛార్జి అయి కోలుకుంటున్నారు. అలా సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లే వారిని ప్రత్యక్షంగా చూడటం మహేశ్‌కి ఎంతో ఇష్టం. అందుకే షూటింగ్‌లేనప్పుడు హాస్పిటల్‌కి వెళ్లి పిల్లల్ని కలుస్తుంటారు.
తెలంగాణలోనూ....
తెలంగాణలో ఉండేవారికీ ఇబ్బంది లేకుండా ‘ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్’ పేరిట హైదరాబాద్‌లోనూ గుండె ఆపరేషన్లు చేయించడం మొదలుపెట్టాం. అందుకుగానూ 126 మంది పిల్లల ఆపరేషన్లకు అవసరమయ్యే డబ్బును కేటాయించాం. వచ్చే ఆరునెలల్లో మరికొంత ఇస్తాం. ఇక్కడి వారు కూడా మమ్మల్ని మహేశ్ ఫ్యాన్స్ అసోసియేషన్ లేదంటే 7449898989 వాట్సాప్ నంబరు ద్వారా సంప్రదించొచ్చు. సమస్య ఉండీ... స్తోమత లేని ఏ చిన్నారి గురించి మాకు తెలిసినా మా కన్న బిడ్డలానే చికిత్స చేయించి కాపాడుకుంటాం.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Telangana News: భాజపాలోకి హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి.. ?
-
General News
covid update: విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణలో 550 దాటిన కొత్త కేసులు
-
India News
Umesh Kolhe: ముందురోజు తప్పించుకున్నా.. తర్వాత చావు తప్పలేదు..!
-
India News
MK Stalin: ఆ సమయంలో పోలీసు భద్రతలో కాలేజీకి వచ్చి పరీక్షలు రాశా: సీఎం స్టాలిన్
-
Sports News
IND vs ENG: అక్కడే ప్రత్యర్థికి అవకాశం ఇచ్చాం: జస్ప్రిత్ బుమ్రా
-
Movies News
Social Look: టాంజానియాలో అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ముంబయిలో తమన్నా జర్నీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- telugu movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!