పసుపు పూల ద్వీపాలు!

కనుచూపు మేర పచ్చని పూల తివాచీ పరుచుకున్నట్లు కనిపిస్తోన్న ఈ పూల తోటలు ఉన్నది ఓ నదిలో అంటే నమ్మగలరా? తూర్పు చైనా జియాంగు ప్రావిన్సులోని డోంగ్‌వాంగ్‌ గ్రామ పరిధిలో ఉందీ సుందర ప్రదేశం. పెరుగుతోన్న జనాభాకి తగ్గట్లు

Published : 03 Apr 2022 00:57 IST

పసుపు పూల ద్వీపాలు!

నుచూపు మేర పచ్చని పూల తివాచీ పరుచుకున్నట్లు కనిపిస్తోన్న ఈ పూల తోటలు ఉన్నది ఓ నదిలో అంటే నమ్మగలరా? తూర్పు చైనా జియాంగు ప్రావిన్సులోని డోంగ్‌వాంగ్‌ గ్రామ పరిధిలో ఉందీ సుందర ప్రదేశం. పెరుగుతోన్న జనాభాకి తగ్గట్లు ఆహార ధాన్యాల సాగుని పెంచుకునే ప్రయత్నంగా స్థానిక రైతులు చేసిన ప్రయోగం... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యటకులను ఆకర్షిస్తోంది. కొన్నేళ్లుగా... డ్యుయోటియన్‌ నదీ పరివాహక ప్రాంత వాసులు నదీగర్భంలోని సారవంతమైన మట్టిని తవ్వి పాన్పులుగా చేసి సంప్రదాయ పద్ధతిలో సాగు చేయడం మొదలుపెట్టారు. దాంతో క్రమంగా అక్కడ వేల ద్వీపాలు పుట్టుకొచ్చాయి. ఇవి ఆకృతిలో భిన్నంగా ఉండటం, నూనె కోసం కెనొలా (ర్యాప్‌సీడ్‌)పూల పంటను వేయడం వంటివి ఈ ప్రాంతానికి కొత్తదనం తీసుకువచ్చాయి. ఈ పూలు వసంతకాలంలో పూయడం మొదలుపెట్టి మే వరకూ ఉంటాయి. అందుకే 2008 నుంచి ఈ నెలల్లో ర్యాప్‌ సీడ్‌ ఫ్లవర్‌ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది స్థానిక ప్రభుత్వం. అంతేనా, ఈ పూల తోటల్ని చూసి రావడానికి పడవలూ, వంతెనలను కూడా ఏర్పాటు చేసింది. పడవలో ప్రయాణిస్తూ అందమైన పసుపు పూలవనాల్లో విహరించడం ఎంత బాగుంటుందో కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..