సిగ్నల్‌ లేకపోయినా మెసేజ్‌ చేయొచ్చు!

సెల్‌ఫోన్‌ సిగ్నలే కాదు, వైఫైలాంటివేమీ మనకు అందుబాటులో లేకపోయినా... అత్యవసరంగా ఫోన్‌లో జీపీఎస్‌ ట్రాకర్‌ తెరవొచ్చు.

Published : 04 Feb 2023 23:27 IST

సిగ్నల్‌ లేకపోయినా మెసేజ్‌ చేయొచ్చు!

సెల్‌ఫోన్‌ సిగ్నలే కాదు, వైఫైలాంటివేమీ మనకు అందుబాటులో లేకపోయినా... అత్యవసరంగా ఫోన్‌లో జీపీఎస్‌ ట్రాకర్‌ తెరవొచ్చు. అంతేకాదు, మెసేజ్‌లూ, మనం ఉన్న లోకేషన్‌ కూడా ఇతరులకు పంపొచ్చు. అయితే అందుకు మన దగ్గర ‘గోటెనా మెష్‌’ అనే ఓ డివైజ్‌ ఉండాలి. కొత్తగా వచ్చిన ఈ గ్యాడ్జెట్‌ ప్రత్యేకంగా దానికదే ఓ నెట్‌వర్క్‌లా పనిచేస్తుందన్నమాట. స్మార్ట్‌ఫోన్‌లో దీని ఆప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని బ్లూటూత్‌ కనెక్ట్‌ చేసుకుంటే దాదాపు ఏడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మన స్నేహితులకు దీని ద్వారా సమాచారం పంపొచ్చు. వాకీటాకీలాంటి ఈ పరికరం మిత్రులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడో, సిగ్నల్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో లేని చోటులో ఉన్నప్పుడో ఉపయోగపడుతుంది. ఈ పరికరం అవసరం మనకు తక్కువే అయినా... కేవలం ఫోన్‌తోనే పనిచేసే దీని నెట్‌వర్క్‌ కొత్త ఫీచర్‌ మాత్రం బాగుంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..