ఎక్కే ధైర్యం ఉందా..?

ఆ చోటుకి వెళ్లాలంటే ప్రకృతిమీద ప్రేముంటే సరిపోదు, పరిసరాల్ని ఆస్వాదించే మనసున్నా చాలదు... అంతకు మించి గుండెలనిండా ధైర్యమూ, సాహసాలకు సై అనగల తెగువా కావాల్సిందే. ఎందుకంటే... అది పాతాళాన్నీ, ఆకాశాన్నీ

Published : 06 Mar 2022 00:44 IST

ఎక్కే ధైర్యం ఉందా..?

ఆ చోటుకి వెళ్లాలంటే ప్రకృతిమీద ప్రేముంటే సరిపోదు, పరిసరాల్ని ఆస్వాదించే మనసున్నా చాలదు... అంతకు మించి గుండెలనిండా ధైర్యమూ, సాహసాలకు సై అనగల తెగువా కావాల్సిందే. ఎందుకంటే... అది పాతాళాన్నీ, ఆకాశాన్నీ కలుపుతూ ఉన్నట్టుండే పర్వతశిఖరం మరి. ఇవన్నీ చైనాలోని వులింగ్‌ పర్వతశ్రేణిలో ఉన్న ఫాంజింగ్‌షాన్‌ సంగతులు. సముద్రమట్టానికి 2,570 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పర్వతం రెండుగా చీలి ఉంటుంది. శిఖరంపైన రెండు వైపులా బుద్ధుడి ఆలయాలు కొలువై ఉంటాయి. వీటిని క్రీస్తుశకం ఏడో శతాబ్దంలో టాంగ్‌ వంశస్థులు నిర్మించారట. ఎంతో ఎత్తులో ఉన్న ఈ గుళ్లను చేరడమంటే మాటలు కాదండోయ్‌. కింద నుంచి పర్వతం బేస్‌ వరకూ రావడం ఒక ఎత్తయితే... అక్కడి నుంచి పైకి చేరడానికి ఇరుకైన దారుల్లోని ఎనిమిదివేల మెట్లెక్కడం అనేది మరో పెద్ద సవాలు. చూస్తుంటేనే కళ్లు తిరిగే ఆ దారిలో అడుగుపెట్టడమంటే పెద్ద సాహసమే కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..