Updated : 05 Dec 2021 02:38 IST

weekly horoscope: రాశిఫలం (డిసెంబర్‌ 05 - డిసెంబర్‌ 11)


దైవానుగ్రహంతో పనులు పూర్తి అవుతాయి. నిందలు మోపేవారుంటారు. మౌనంగా ఉండాలి. తొందరవద్దు. లోతుగా విశ్లేషించి పనిచేస్తే వ్యయం తగ్గుతుంది. మిత్రత్వం శక్తినిస్తుంది. ఎదుగుదలకు అవసరమైన పరిస్థితులుంటాయి. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. శత్రుదోషం తొలగుతుంది. వారం మధ్యలో మేలు చేకూరుతుంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.


తెలియని ఆటంకాలుంటాయి. చాకచక్యంగా వ్యవహరించండి. అపార్థాలకు అవకాశముంది, శాంతంగా సమాధానమివ్వాలి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఆపదలు పొంచి ఉన్నాయి. సందర్భాన్నిబట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంట్లో వారితో చెప్పి చేసే పనులు విజయాన్నిస్తాయి. శుభవార్త వింటారు. నవగ్రహ ధ్యానం చేయండి, ప్రశాంతత వస్తుంది.


అద్భుతమైన ఫలితాలు సాధించే కాలమిది. ఒక క్రమ పద్ధతిలో పనిచేయండి. ఉద్యోగంలో అధికార యోగం సూచితం. ఆశయం నెరవేరుతుంది. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఆపదలు దరిచేరవు. వ్యాపార లాభం ఉంది. భూ- గృహ- వాహనాది కోరికలు నెరవేరతాయి. సన్మార్గంలో వృద్ధిని సాధించండి. ఇష్టదైవస్మరణతో శాంతి లభిస్తుంది.


ఏకాగ్రచిత్తంతో పని చేయండి. సకాలంలో విధులు నిర్వహించండి. ముందస్తు ప్రణాళికలు అవసరం. దూరదృష్టితో ఆలోచించి పనిచేస్తే ఏ సమస్యా రాదు. దైవబలం కాపాడుతుంది. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. నష్టాలు సూచితం. అపార్థాలకు అవకాశమివ్వవద్దు. వారం మధ్యలో ఒక పనిలో పురోగతి ఉంటుంది. ఈశ్వర ధ్యానం సదా రక్షిస్తుంది.


మంచి కాలమిది. ఇప్పుడు చేసే పనులు విజయాన్నిస్తాయి. ఉద్యోగంలో తగిన ప్రతిఫలం ఉంటుంది. కష్టాలు తొలగుతాయి. ఆశించిన ఫలితం వస్తుంది. మనోభీష్టం నెరవేరుతుంది. ప్రసన్నచిత్తంతో పనిచేయండి. ప్రశంసలు లభిస్తాయి. శీఘ్ర కార్యసిద్ధి. ఆస్తులు కొంటారు. వ్యాపార బలం పెరుగుతుంది. స్థిరమైన లాభాలు ఉంటాయి. శివారాధన ఉత్తమం.


ఉద్యోగంలో విజయం లభిస్తుంది. మనసులో అనుకున్నదే జరుగుతుంది. నిరంతర సాధనతో భారీ లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపారంలో ఆశించిన ఫలితం వస్తుంది. ప్రశాంత చిత్తంతో మాట్లాడాలి. ఈర్ష్య పడేవారు ఉన్నారు. ఒత్తిడిని జయించండి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. మిత్రులవల్ల లాభపడతారు. కొంత విశ్రాంతి అవసరం. విష్ణుదర్శనం మంచిది.


విశేషమైన శుభాలున్నాయి. ఒక్కొక్కటీ నేర్పుతో సాధిస్తారు. అద్భుతమైన తెలివితేటలతో ఆశయాన్ని నెరవేర్చుకుంటారు. దేనికీ వెనకాడవద్దు. ధైర్యంగా ముందుకు సాగాలి. వ్యాపారం కలిసివస్తుంది. స్వల్ప ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగపరంగా సంతృప్తి లభిస్తుంది. తోటివారి నుండి తగిన ప్రోత్సాహముంటుంది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.


చిత్తశుద్ధి లక్ష్యాన్ని చేరుస్తుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. ఉద్యోగంలో బాగుంటుంది. అపోహలు తొలగుతాయి. ఆదరించేవారు పెరుగుతారు. ఆత్మీయులను ప్రేమగా పలకరించండి. ధర్మదేవతానుగ్రహం సిద్ధిస్తుంది. వ్యాపారం శుభప్రదం. ధనధాన్య యోగముంటుంది. సద్గోష్ఠి చేస్తారు. ప్రయాణ లాభముంది. ఇష్టదేవతను స్మరించండి, అదృష్టవంతులవుతారు.


దైవబలం ఉంది, ధైర్యంగా నిర్ణయాలు తీసు కోవాలి. లక్ష్యం నెరవేరేవరకూ వదలవద్దు. తప్పకుండా మేలు జరుగుతుంది. అధికారులతో ప్రశాంతంగా మాట్లాడాలి.  చిన్న చిన్న ఆటంకాలను అధిగమిస్తారు. వ్యాపారం బాగుంటుంది. ఆపదలు తొలగుతాయి. కల సాకారమవుతుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆరోగ్యం జాగ్రత్త. రవిస్తుతి మేలుచేస్తుంది.


శ్రేష్ఠమైన కాలం. అనుకున్న ఫలితం వస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యకార్యాల్లో గుర్తింపు పెరుగుతుంది. మీవల్ల కొందరు లాభపడతారు. వ్యాపారం బాగుంటుంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంతటా సానుకూల వాతావరణం ఉంటుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది. ధర్మమార్గంలో ముందుకు సాగండి. శివధ్యానం మంచిది.


కాల సహకరిస్తుంది. సంశయాలు తొలగుతాయి. ఉత్సాహంగా పని ప్రారంభించండి. అవరోధాలను అధిగమిస్తారు. మిత్ర బలం పెరుగుతుంది. సుఖసంతోషాలు ఉంటాయి. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. విఘ్నాలు విజయాలుగా మారే అవకాశముంది. ఇష్టదైవారాధన ఉత్తమం.


ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. లక్ష్యాన్ని చేరేవరకూ శ్రమించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. గిట్టనివారు నిందలు మోపుతారు. బాధ్యతలను సకాలంలో నిర్వర్తించండి. అంతిమంగా అనుకూలఫలితం వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ప్రయాణ లాభముంది. గణపతిస్మరణతో ప్రశాంతత లభిస్తుంది.


 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని