Updated : 23 Jan 2022 06:56 IST

Weekly Horoscope: రాశిఫలం

అనేక శుభాలున్నాయి. చక్కటి విజయం సొంతమవుతుంది. మీదైన పద్ధతిలోనే ముందుకు సాగండి. ఉద్యోగంలో తగినంత గుర్తింపూ సంతృప్తీ లభిస్తాయి. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరతాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. కొత్త వ్యాపారాలకు అనువైన కాలమిది. మనోబలం ఉత్సాహాన్నిస్తుంది. సంతోషించే అంశాలున్నాయి. లక్ష్మీస్మరణ మేలుచేస్తుంది.


మంచి కాలమిది. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగంలో జాగ్రత్త. తృటిలో ఆపద నుంచి బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో, సమయస్ఫూర్తితో ముందుకు సాగాలి. తప్పులు వెతికేవారున్నారు. ధర్మమార్గంలో విజయం లభిస్తుంది. కుటుంబసభ్యుల సలహాతో అదృష్టవంతులవుతారు. అనుకున్నది సాధిస్తారు. నవగ్రహ శ్లోకాలు చదివితే శుభం.


దైవబలంతో ముఖ్యకార్యాల్లో సత్ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. పై అధికారుల అండ లభిస్తుంది. ఆపదలు తొలగుతాయి. అవరోధాలను అధిగమిస్తారు. కీర్తి పెరుగుతుంది. ఒక విషయంలో సందిగ్ధావస్థ ఏర్పడినా మంచి పరిష్కారమూ లభిస్తుంది. వ్యాపారంలో శ్రమ అధికమవుతుంది. ఇష్టదైవాన్ని స్మరిస్తే శక్తి లభిస్తుంది.


మనోబలం కాపాడుతుంది. సకాలంలో పనిచేస్తే కార్యసిద్ధి ఉంటుంది. దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది లభిస్తుంది. సన్మార్గంలో అభివృద్ధిని సాధిస్తారు. పట్టుదల చాలా బాగా పనిచేస్తుంది. వ్యాపారంలో కొంత శ్రమ ఉన్నా ఫలితం బాగుంటుంది. ఇతరులకు సహాయం చేయబోయి, ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తోంది. విష్ణుధ్యానం శుభప్రదం.


శుభయోగముంది. అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. కల సాకారమవుతుంది. భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగంలో పదవీ లాభముంటుంది. యోగ్యతను పెంచుకుంటూ ముందుకెళ్లండి. పదిమందికీ ఆదర్శవంతులవుతారు. ఇంటాబయటా కలిసివస్తుంది. దోషం తొలగుతుంది.  ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. లక్ష్మీ ఆరాధన శక్తినిస్తుంది.


మనోబలంతో లక్ష్యాన్ని చేరతారు. ఉద్యోగంలో కలిసివస్తుంది. ఆశయ సాధనలో కొత్త మార్గాలను అన్వేషించండి. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలి. కృషిని బట్టి ఫలితం ఉంటుంది. కొందరివల్ల విఘ్నాలు ఎదురవుతాయి. పనుల్లో జాప్యం అవుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్త వింటారు.


బ్రహ్మాండమైన విజయం లభిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. పదవీయోగం సూచితం, స్థిరత్వం వస్తుంది. పై అధికారులతో సౌమ్యంగా మాట్లాడాలి. మొహమాటం వద్దు. క్రమంగా పైకి వస్తారు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. నూతన మార్గాల్లో ధన సంపాదనకు అవకాశముంటుంది. రుణ సమస్యలు తొలగుతాయి. వ్యాపారం శుభప్రదం. శివస్మరణ మంచిది.


కాలం అన్నివిధాలా సహకరిస్తుంది. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. అదృష్ట యోగముంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఆర్థికంగా కలిసివస్తుంది. ఎదురుచూస్తున్న ఫలితం ఒకటి లభిస్తుంది. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. ఆందోళనలు తగ్గుతాయి. ధైర్యంగా ఆలోచించాలి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని స్మరించండి, మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది.


మంచి పనులు చేసి గొప్పవారి దృష్టిలో పడతారు. ఉద్యోగంలో శుభ ఫలితం లభిస్తుంది. వ్యాపారలాభం ఉంది. విఘ్నాలను అధిగమిస్తారు. అభీష్టం సిద్ధిస్తుంది. దీక్షతో పని పూర్తిచేయాలి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పదిమందికీ సహాయపడతారు. ఇంట్లో శుభం జరుగుతుంది. ఆపదలు తొలగుతాయి. ఇష్టదేవతను స్మరించండి, శాంతి లభిస్తుంది.


దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు. ధర్మమార్గంలో పని మొదలుపెట్టండి. కీర్తి లభిస్తుంది. మోసం చేసేవారున్నారు. తెలివిగా వ్యవహరించాలి. ఉద్యోగంలో అనుకూల ఫలితం ఉంటుంది. ఆందోళన కూడా పెరుగుతుంది. అపార్థాలకు తావివ్వవద్దు. ఆర్థికస్థితి అనుకూలం. రుణాలు తీరతాయి. కాలహరణం జరగకుండా జాగ్రత్తపడాలి. సూర్యస్తుతి మేలు చేస్తుంది.


ఆర్థికంగా బాగుంటుంది. నిర్మలచిత్తంతో ముందుకు సాగండి. సమస్యలు తొలగుతాయి. అదృష్టవంతులవుతారు. ప్రయత్నాలు సఫలమవుతాయి. విఘ్నాలున్నా నిరుత్సాహపడవద్దు. కాలక్షేపం కూడదు. వ్యాపారం బాగుంటుంది. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. సొంత విషయాలు బయటవారితో చర్చించవద్దు. మిత్రబలం రక్షిస్తుంది. ఆదిత్యహృదయం చదివితే మేలు.


అద్భుతమైన విజయం లభిస్తుంది. మనోభీష్టం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో అంచెలంచెలుగా పైకి వస్తారు. వ్యాపారంలో విశేష ధన లాభాలున్నాయి. సంకల్పసిద్ధి ఉంటుంది. ప్రయత్నాలు సానుకూల ఫలితాన్నిస్తాయి. శాశ్వతమైన శుభం జరుగుతుంది. శ్రమ పెరిగినా తగినంత లాభముంటుంది. ఆనందించే అంశాలున్నాయి. ఇష్టదైవస్మరణతో శాంతి లభిస్తుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని