పొట్టలోని బ్యాక్టీరియా వల్లనే బరువు!

కొందరు ఎంత తిన్నా సన్నగా అలాగే ఉంటారు. మరికొందరు అంతే మోతాదులో అదే ఆహారం తిన్నా త్వరగా బరువు పెరిగిపోతుంటారు

Updated : 08 Jan 2023 13:07 IST

పొట్టలోని బ్యాక్టీరియా వల్లనే బరువు!

కొందరు ఎంత తిన్నా సన్నగా అలాగే ఉంటారు. మరికొందరు అంతే మోతాదులో అదే ఆహారం తిన్నా త్వరగా బరువు పెరిగిపోతుంటారు. దీనంతటికీ కారణం పొట్టలోని బ్యాక్టీరియానే అని చెబుతున్నారు  కోపెన్‌హోగెన్‌ యూనివర్సిటీ పరిశోధకులు. పొట్టలో నివసించే కొన్ని రకాల బ్యాక్టీరియాకి మనం తిన్న ఆహారం నుంచి శక్తిని గ్రహించుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంతోనే కొంతమంది త్వరగా బరువు పెరుగుతారట. ఈ విషయమై గత కొన్ని దశాబ్దాలుగా పొట్టలోని బ్యాక్టీరియా మీద ఎన్నో రకాల అధ్యయనాలు చేస్తూ వస్తున్నారు. అందులో దీనికీ ఊబకాయానికీ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఇందుకోసం లావుగా ఉన్న
ఎలుకల మలం నుంచి బ్యాక్టీరియాని సేకరించి సన్నగా ఉన్న ఎలుకల్లో ప్రవేశపెట్టగా- కొన్నాళ్లకు ఇవీ అలాగే బరువు పెరిగాయట. అదీగాక జీవక్రియలో భాగంగా పొట్టలోని బ్యాక్టీరియాకి కూడా కొంత శక్తిని అందిస్తుంది. వీటన్నింటి ఆధారంగా పొట్టలోని బ్యాక్టీరియాకీ బరువుకీ సంబంధం ఉందని భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..