Updated : 28 Nov 2021 14:22 IST

బాలవినోదం 


సరైన ఎంపిక!

మహేంద్రగిరి పరిపాలకుడు భూపాలవర్మకు చిత్రకళ అంటే చాలా ఇష్టం. ఏటా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించేవాడు. ‘ప్రకృతి సోయగం’ అనే అంశం మీద చిత్రకారులు చిత్రాలు గీయాలని ఓ ఏడాది పోటీ నిర్వహించాడు. గెలిచిన వారికి వెయ్యి వరహాలు కానుకగా ఇస్తానని ప్రకటించాడు. వందల సంఖ్యలో చిత్రకారులు పోటీ పడ్డారు. వీరిలో తొంభైఏళ్ల సింహాచలం, పాతికేళ్ల గోపాలుడు గీసిన చిత్రాలు దేనికవే సాటిగా ఉన్నాయి. కానీ కొన్ని అంశాల్లో సింహాచలం గీసిన చిత్రమే మేటిగా ఉంది. న్యాయనిర్ణేతల్లో ఎక్కువ మంది సింహాచలమే విజేత అనగా... కొద్దిమంది గోపాలుడికీ ఆ అర్హత ఉందన్నారు. మంత్రి ఈ సమస్యను రాజు దృష్టికి తీసుకువెళ్లాడు. ‘ఓ రెండు రోజుల తర్వాత విజేతను ప్రకటిస్తా’ అని చెప్పి రాజు ఆ రోజుకు సభను ముగించాడు. ‘చిత్రకళలో చెయ్యి తిరిగిన సింహాచలమే విజేతగా నిలవడం ఖాయం’ అని అందరూ అనుకున్నారు. రెండురోజుల తర్వాత తిరిగి సభ ప్రారంభ మైంది. అప్పుడు రాజు సింహాచలాన్ని శాలువాతో సత్కరించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఇంతలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రాజు గోపాలుడినే విజేతగా నిర్ణయించి వరహాలమూట అందించాడు. అప్పటితో సభ ముగిసింది. ‘ప్రభూ! సింహాచలం గీసిన చిత్రమే బాగుంది కదా! మరి మీరెందుకు ఆ గోపాలుణ్ని విజేతగా ఎంపిక చేశారు’ అని మంత్రి అడిగాడు. ‘మంత్రివర్యా! నేను గోపాలుడి గురించి వాకబు చేయించాను. అతడు చాలా పేదవాడు. గోపాలుడికి మనం ఇప్పుడు చేయూత ఇవ్వాలి. పైగా సింహాచలం ఇక ఎంతోకాలం చిత్రాలు గీయలేడు. చిత్రకళలో తలపండిన సింహాచలంతో నువ్వానేనా అన్నట్లుగా పోటీపడిన గోపాలుడు అనతికాలంలోనే ఆయన స్థానాన్ని కచ్చితంగా భర్తీ చేస్తాడు’ అని రాజు చెప్పాడు. భూపాల వర్మ ఊహించి నట్లుగానే చాలా తక్కువ సమయంలోనే గోపాలుడు తన చిత్రకళతో మహేంద్రగిరి రాజ్యం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేశాడు.


విజ్ఞానం... వినోదం... ఒకేచోట!

సైన్స్‌ అంటేనే మనలో చాలామంది భయపడుతుంటారు కదా. కానీ www.sciencekids.co.nz ఈ వెబ్‌సైట్‌ తెరిచారంటే సైన్స్‌ మీద ఇష్టం పెరుగుతుంది. ఇంకా సైన్స్‌ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ బోర్‌ కొట్టే ఫార్ములాలు ఉండవు. ‘ఫ్యాక్ట్స్‌’ అంశంలో వింతలూ విశేషాలూ ఉంటాయి, సిద్ధాంతాలేమీ ఉండవు. ఎన్నో తెలియని విషయాలు తెలుసుకునే వీలుంటుంది. ‘వీడియోస్‌’ విభాగంలో రకరకాల సైన్స్‌ ప్రయోగాల వీడియోలుంటాయి. అవి ఫన్నీగా ఉంటూనే విజ్ఞానాన్ని అందిస్తాయి. వీటన్నింటితో పాటూ వింతగొలిపే ప్రశ్నలూ వాటికి సమాధానాలూ ‘క్విజ్‌’ విభాగంలో ఉంటాయి. జంతువులు, మొక్కలు, భూమి, టెక్నాలజీ, వాతావరణం, అంతరిక్షం... ఇలా ఎందులో సందేహం ఉంటే అందులోకి వెళ్లి తెలుసుకోవచ్చు. అందుకు ‘టాపిక్స్‌’ విభాగాన్ని క్లిక్‌ చేస్తే సరి. అన్నట్లు స్కూల్‌లో ఏదైనా సైన్స్‌ ప్రాజెక్టు చేసుకురమ్మంటే అప్పటికప్పుడు ఏం చేయాలా... అని తెగ హైరానా పడుతుంటాం. అలాంటప్పుడు ఇదిగో ఈ వెబ్‌సైట్‌లో ‘ప్రాజెక్టు’ అంశం తెరవండి. మీ భయం హుష్‌కాకి అవుతుంది. ఎందుకంటే ఇందులో బోలెడన్ని ప్రాజెక్టు ఐడియాలు ఉన్నాయి మరి. అన్నట్టూ ఇందులో సైన్స్‌కు సంబంధించిన ఆటలున్నాయి, తెలుసా! ఇవి భలే ఆసక్తిగా ఉంటాయి. మన స్నేహితులకు కూడా చెప్పి ఇందులోని కొత్త ఆటలన్నీ ఎలా ఆడాలో తెలుసుకుని ఆడుకోవచ్చు. అదన్నమాట సంగతి. మరింకేం సరదాగా ఈ వెబ్‌సైట్‌లో విహరిద్దామా!Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని