ప్రయోగశాలలో మెదడు!

కృత్రిమ మేధతో మనిషి చేసే పనులెన్నో యంత్రాలతో చేయించగలుగుతున్నారనేది తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా దెబ్బతిన్న మెదడు స్థానంలో మరో చిన్నమెదడును అమర్చి కూడా ఆయుష్షును పెంచవచ్చు అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు.

Published : 21 Jan 2023 23:31 IST

ప్రయోగశాలలో మెదడు!

కృత్రిమ మేధతో మనిషి చేసే పనులెన్నో యంత్రాలతో చేయించగలుగుతున్నారనేది తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా దెబ్బతిన్న మెదడు స్థానంలో మరో చిన్నమెదడును అమర్చి కూడా ఆయుష్షును పెంచవచ్చు అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు. ఎందుకంటే ఇటీవల వయోజన చర్మ కణాలను మళ్లీ అపరిపక్వ స్థితికి తీసుకెళ్లి వాటిని శరీరంలోని ఏ కణంగానైనా మార్చే సరికొత్త ప్రక్రియను కనుగొన్నారు. ‘ప్లూరిపొటెంట్‌ స్టెమ్‌సెల్స్‌’గా పిలిచే వీటితో చిన్నసైజులో అన్ని రకాల అవయవాల్నీ రూపొందిస్తున్నారు. వీటినే ‘ఆర్గనాయిడ్స్‌’ అంటున్నారు. ఇవి సహజ అవయవాల్లా పనిచేయడమే కాదు, టిష్యూకల్చర్‌ ద్వారా రూపొందించిన అవయవాలకన్నా మెరుగ్గా ఉన్నాయట. ఎన్నో సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం... ఇలా అన్ని అవయవాలకీ మినీ వెర్షన్స్‌ తయారుచేయాలని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఎలుకల్లో ఈ మెదడు ఆర్గనాయిడ్‌ను ప్రవేశపెట్టినప్పుడు అది చక్కగా స్పందించినట్లు గుర్తించారు. అంతేకాదు, ఈ ఆర్గనాయిడ్‌ మెదడుకి రక్తనాళాలు అనుసంధానమై రక్త సరఫరా కూడా జరిగిందట. కాబట్టి మున్ముందు దీని ఆధారంగా అనేక నాడీ సమస్యల్ని నివారించవచ్చని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..