అక్కడ... బడికి... రోజూ ఇలా వెళ్ళాల్సిందే!

స్కూలు పిల్లలు- ఇంటి ముందు బస్సు ఎక్కి బడిలో దిగిపోవడమే మనకు తెలుసు కానీ, కొన్నిచోట్ల- విద్యార్థులకు రోజూ స్కూలుకు వెళ్లడమంటేనే సాహసం. ఇంటి నుంచి స్కూలుకు చేరడానికి ఎత్తయిన పర్వతాలు ఎక్కేస్తారు,

Published : 23 Jun 2024 00:19 IST

స్కూలు పిల్లలు- ఇంటి ముందు బస్సు ఎక్కి బడిలో దిగిపోవడమే మనకు తెలుసు కానీ, కొన్నిచోట్ల- విద్యార్థులకు రోజూ స్కూలుకు వెళ్లడమంటేనే సాహసం. ఇంటి నుంచి స్కూలుకు చేరడానికి ఎత్తయిన పర్వతాలు ఎక్కేస్తారు, పెద్ద పెద్ద లోయలు దాటేస్తారు, పొడవైన వాగుల్లో ప్రయాణిస్తారు, రాళ్లూరప్పల్లో నడిచేస్తారు. అంతేనా మరెన్నో ప్రమాదకరమైన కేబుళ్లపైన జారుతూ బడికి చేరుకుంటారు. చూస్తేనే గుండె ఝల్లుమంటున్న ఈ ఫొటోలన్నీ అలాంటి ప్రమాదకరమైన స్కూళ్ల దారులవే. దాదాపు 2600 అడుగుల ఎత్తులో ఉండే చైనా విలేజ్‌ అటులీయర్‌ ఊరి పిల్లలు బడికి వెళ్లడానికి రోజూ ఎత్తయిన నిచ్చెనల మీద కొండ ఎక్కి దిగాల్సిందే. కొలంబియాలోని ఓ పర్వత గ్రామం చిన్నారులు రియో నీగ్రో నదిపైనుంచి అరకిలోమీటరు పొడవునా జిప్‌లైన్‌ మీదుగా జారుకుంటూ వెళ్లకతప్పదు. మన దేశంలోని జన్‌స్కార్‌ ప్రాంతంలోని విద్యార్థులు రోజూ స్కూలుకి హిమాలయాల్లో నడుచుకుంటూ పోతారు. ఇంకా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌ దేశాల్లో నదులపైన వేలాడే వంతెనలమీద నడుచుకుంటూ, తేలియాడే ట్యూబుల్లో కూర్చునీ స్కూలుకు హాజరవుతారు. కావాల్సినవన్నీ అమర్చి, ఏ ఇబ్బందీ లేకుండా బడిలో దింపినా...  వెళ్లమంటూ మారాం చేసే పిల్లలు... ఇలా ప్రమాదపు అంచుల దారుల్లోనూ బ్యాగులు మోసుకుంటూ పాఠశాలలకు వెళ్లడమంటే నిజంగా గ్రేటే కదా!


క్లిక్‌... క్లిక్‌...

దిలోని కొమ్మ అంచున జారి, దాహం తీర్చుకోబోయిన చిట్టి ఉడత నీళ్ళలోని తన ప్రతిబింబాన్ని కాస్త ఆశ్చర్యంగా మరికాస్త అయోమయంగా చూస్తూ కెమెరా కంటికి చిక్కిందిలా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..