ఏం ఐడియా గురూ!

కొబ్బరి నీళ్లు తాగాలంటే... బండి దగ్గరకు వెళ్లాలి. లేదంటే మార్కెట్‌లో ప్లాస్టిక్‌ బాటిళ్లలోనూ, టెట్రాప్యాకెట్లలోనూ అందుబాటులో ఉన్నవి తాగాలి.

Published : 17 Dec 2022 23:31 IST

ఏం ఐడియా గురూ!

కొబ్బరి నీళ్లు తాగాలంటే... బండి దగ్గరకు వెళ్లాలి. లేదంటే మార్కెట్‌లో ప్లాస్టిక్‌ బాటిళ్లలోనూ, టెట్రాప్యాకెట్లలోనూ అందుబాటులో ఉన్నవి తాగాలి. అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఆ నీళ్లని ప్రాసెస్‌ చేస్తారు. అందుకే చాలామంది తాజా కొబ్బరిబొండాం నీళ్లనే తాగడానికి ఇష్టపడుతుంటారు. మరి ప్రతిసారీ స్టాల్‌కెళ్లి బొండాలు తెచ్చుకోవడం కుదరకపోవచ్చు. అందుకని థాయ్‌లాండ్‌లోని కొబ్బరిబొండాలు అమ్మే రైతులు- బొండాల చుట్టూ తొక్కతీసి వాటికి ప్లాస్టిక్‌పోర్ట్‌, స్ట్రాపెట్టి... సీల్‌ వేసి రెడీ టు డ్రింక్‌ పేరుతో మార్కెట్‌లోకి తెస్తున్నారు. ఒక్కో బొండాన్ని సుమారు రూ.600కి అమ్ముతున్నారు. ఒక బాక్సులో నాలుగైదు పెట్టి సూపర్‌మార్కెట్లలో అందుబాటులో ఉంచుతున్నారు. సరికొత్త ప్యాక్‌ రూపంలో వస్తున్న ఈ తరహా కొబ్బరిబొండాలను తీసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఎక్కడ కావాలంటే అక్కడ తాజాగా కొబ్బరి నీరుతాగే అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు