అదిగో హిట్లర్‌... ఇదిగో స్మైలీ!

మనిషిని పోలిన మనుషులు ఉండటం సహజం. కానీ మనుషుల్ని పోలిన కీటకాలు ఉండటం... ఆశ్చర్యం! ఈ ఫొటోలు అవే. పాములూ కప్పలూ పెద్ద కీటకాలూ తమను తినకుండా కాపాడుకోవడానికి కొన్ని కీటకాలకు ప్రకృతి ఈ రూపురేఖల్ని ప్రసాదిస్తుందట.

Published : 03 Dec 2022 23:25 IST

అదిగో హిట్లర్‌... ఇదిగో స్మైలీ!

నిషిని పోలిన మనుషులు ఉండటం సహజం. కానీ మనుషుల్ని పోలిన కీటకాలు ఉండటం... ఆశ్చర్యం! ఈ ఫొటోలు అవే. పాములూ కప్పలూ పెద్ద కీటకాలూ తమను తినకుండా కాపాడుకోవడానికి కొన్ని కీటకాలకు ప్రకృతి ఈ రూపురేఖల్ని ప్రసాదిస్తుందట. ఇలా ఉండటంవల్ల వీటిపైన దాడి చేయడానికి శత్రువులకు ధైర్యం సరిపోదు. కొన్ని నిత్యం ఇలానే ఉంటే.. కొన్ని మాత్రం అవసరాన్నిబట్టి ఊసరవెల్లిలా తమను మార్చుకుంటాయి. నెత్తిమీద కురచ జుట్టు, పొట్టి మీసంతో ఉన్న పురుగుని హిట్లర్‌ బగ్‌ అంటారు. శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాల్లో కనిపించే ఈ పురుగు ఈమధ్య మన దేశంలోనూ దర్శనమిచ్చింది. నోరారా నవ్వుతున్నట్టు కనిపిస్తోన్న పసుపుపచ్చని సాలీడుకి స్మైలీ అని పేరు. ఇలా ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రకృతిలో ఎన్ని వింతలో కదా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..