పాపాయి తలమీద పాపిటతో పువ్వు!

చిన్నారుల చిట్టిపొట్టి జుట్టుకు- ఒక క్లిప్పు పెట్టో లేదంటే పోనీ కట్టో హెయిర్‌లుక్కును మారుస్తుంటాం. కానీ ఇక్కడున్న ఫొటోల్ని చూశారా...

Updated : 16 Jun 2024 00:39 IST

చిన్నారుల చిట్టిపొట్టి జుట్టుకు- ఒక క్లిప్పు పెట్టో లేదంటే పోనీ కట్టో హెయిర్‌లుక్కును మారుస్తుంటాం. కానీ ఇక్కడున్న ఫొటోల్ని చూశారా... ఉన్న ఆ కొంచెం జుట్టులోనే ఎన్నెన్నో కొత్త హెయిర్‌ స్టైళ్లనీ చూపించేశారు. ‘హెయిర్‌ పిన్నులూ, క్లిప్పులూ పెట్టడం కన్నా ముందు- జుట్టుతోనే అందమైన అలంకరణ తీసుకొస్తే అదిరిపోదూ’ అనుకున్న హెయిర్‌స్టైలిస్టులు- ఈ సరికొత్త ప్రయోగాల్ని చేస్తున్నారు. నిటారు పాపిటకు అటూ ఇటూ చిన్న చిన్న పాయలల్లి ఒక హెయిర్‌స్టైల్‌ను చూపిస్తే, రకరకాల జడల అల్లికలతో పూలూ, ఆకులూ ఇంకా ఇతర డిజైన్లనీ తీసుకొస్తున్నారు. నల్లని కురులపైన కొట్టొచ్చే తెల్లని పాపిట దారులూ, సన్నని జడల పాయల అల్లికలు- చూసేందుకు ముద్దొచ్చినా... అసలు తలలో దువ్వెన పెడితేనే పరుగులు తీసే పిల్లలే- ఇంత ఓపిగ్గా వెరైటీ జడల్ని ఎలా వేయించుకున్నారబ్బా అని ఆశ్చర్యమూ కలగకమానదు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..