Published : 04 Feb 2023 23:30 IST

వదులైన ఉంగరం కోసం!

ప్రియమైనవారు సర్‌ప్రైజ్‌గా తీసుకొచ్చిన డైమండ్‌ రింగో, బంధువులు ప్రేమగా కొన్న బంగారు ఉంగరమో... కాస్త వదులుగా ఉందంటే ఏం చేస్తాం.. వేలికి పెట్టుకుంటే జారిపడిపోతుందని పక్కన పెట్టేస్తుంటాం. కానీ ఓ చిన్న వస్తువుతో అలాంటి సమస్యకూ ఇట్టే చెక్‌ పెట్టేయొచ్చు. ‘రింగ్‌ సైజ్‌ అడ్జెస్టర్‌’ పేరుతో వచ్చిన ఈ వస్తువు- వదులుగా ఉన్న ఉంగరాన్ని సరిగ్గా వేలికి సరిపోయేలా చేస్తుంది. పారదర్శకమైన ప్లాస్టిక్‌లా ఉండే ఈ అడ్జెస్టర్‌... బంగారూ, వెండీ రంగుల్లోనూ దొరుకుతోంది. వీటిల్లో మన రింగ్‌కు సరిపోయే వాటిని కొనుక్కోవచ్చు. ఉంగరం కిందవైపు వీటిని (ఫొటోలో ఉన్నట్టుగా) చుట్టేశామంటే... ఇటు చూడ్డానికీ అంత ఇబ్బందిగానూ ఉండదు, అటు ఉంగరమూ పడిపోకుండా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..