ఎంబ్రాయిడరీ ప్యాచ్‌లతో కరెంట్‌!

మనం కదిలినా నడిచినా పరుగెత్తినా కొత్త విద్యుచ్ఛక్తి విడుదలవుతుంది. అందుకే ఇటీవల మనం ధరించే దుస్తులూ యాక్సెసరీల ద్వారా ఆ శక్తిని గ్రహించి చిన్న చిన్న అవసరాలకు వాడుకోవచ్చని చెబుతూ ఆ దిశగా ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు.

Updated : 08 Jan 2023 04:27 IST

ఎంబ్రాయిడరీ ప్యాచ్‌లతో కరెంట్‌!

మనం కదిలినా నడిచినా పరుగెత్తినా కొత్త విద్యుచ్ఛక్తి విడుదలవుతుంది. అందుకే ఇటీవల మనం ధరించే దుస్తులూ యాక్సెసరీల ద్వారా ఆ శక్తిని గ్రహించి చిన్న చిన్న అవసరాలకు వాడుకోవచ్చని చెబుతూ ఆ దిశగా ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగా  నార్త్‌ కరొలినా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు- సరికొత్త స్మార్ట్‌ దుస్తులకు రూపకల్పన చేశారు. అదెలా అంటే- సాధారణ దుస్తులమీద ఎంబ్రాయిడరీ ప్యాచ్‌ల్ని కుట్టడం ద్వారా కరెంట్‌ను ఉత్పత్తి చేయవచ్చట. అయితే ఇందుకోసం వీళ్లు ముందుగా పాలీయురిథేన్‌తో పూత పూసిన కాపర్‌ దారాలను రూపొందించారు. అయితే ఈ దారాలను దుస్తులమీద నేరుగా కుట్టకుండా అడుగున సింథటిక్‌ పాలిమర్‌తో తయారైన వస్త్రాన్ని పెట్టి ఆపైన కాపర్‌ దారాలతో ఎంబ్రాయిడరీ చేస్తారు. దాన్ని కప్పుతూ మళ్లీ కాటన్‌ లేదా సిల్కుదారాలతో కుడతారు. ఇప్పుడు ఈ ప్యాచ్‌లున్న దుస్తుల్ని వేసుకున్న వ్యక్తి కదులుతుంటే కాపర్‌ వైర్లూ కృత్రిమ పాలిమర్‌ దారాలూ ఒకదానికి ఒకటి తగలడంతో కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తయిన కరెంటుని బ్యాటరీల్లో నిల్వ చేసేలా దుస్తుల్ని డిజైన్‌ చేస్తే... ఫోనూ, వాచ్‌... వంటివి ఛార్జ్‌ చేసేందుకు వాడుకోవచ్చు అంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..