బీపీకి పీచు ట్యాబ్లెట్లు!

బీపీ ఒకసారి వచ్చిన తరవాత దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే రోజూ ట్యాబ్లెట్‌ తప్పనిసరి. అయితే ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌కు చెందిన పరిశోధకులు- జన్యు మార్పిడి చేసిన పీచు పదార్థంతో తయారైన సప్లిమెంట్లను వాడటం ద్వారా బీపీని తగ్గించవచ్చు అంటున్నారు.

Published : 21 Jan 2023 23:41 IST

బీపీకి పీచు ట్యాబ్లెట్లు!

బీపీ ఒకసారి వచ్చిన తరవాత దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే రోజూ ట్యాబ్లెట్‌ తప్పనిసరి. అయితే ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌కు చెందిన పరిశోధకులు- జన్యు మార్పిడి చేసిన పీచు పదార్థంతో తయారైన సప్లిమెంట్లను వాడటం ద్వారా బీపీని తగ్గించవచ్చు అంటున్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న మందుల్లానే ఈ పీచు పదార్థం కూడా పనిచేస్తుందనీ, మూడు వారాల్లోనే బీపీని అదుపులోకి తీసుకువస్తుందనీ చెబుతున్నారు. సాధారణంగా పొట్టలోని బ్యాక్టీరియాలో మార్పులు రావడం వల్లే అనేక వ్యాధులు వస్తాయి. పరిశోధకులు ఆ బ్యాక్టీరియాను నిశితంగా పరిశీలించినప్పుడు- అది ఉత్పత్తి చేసే ఎసిటేట్‌, బ్యుటిరేట్‌ అనే రెండు రకాల షార్ట్‌- చెయిన్‌ ఫ్యాటీ ఆమ్లాల సంఖ్య తగ్గడంవల్లే బీపీ వ్యాధి బారినపడుతున్నట్లు గుర్తించారు. అంటే- ఆ ఫ్యాటీ ఆమ్లాల సంఖ్యను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా పెరగాలన్నమాట. అందుకే జన్యుసాంకేతిక పరిజ్ఞానంతో  ఈ రెండు రకాల ఆమ్లాల శాతం పెరిగే మొక్కజొన్నను రూపొందించారు. ఆ గింజల పొడితోనే సప్లిమెంట్లను తయారుచేసి మూడు వారాలపాటు రోగులకు ఇచ్చినప్పుడు- వాళ్ల పొట్టలోని బ్యాక్టీరియాలో మార్పు వచ్చిందట. తద్వారా ఎసిటేట్‌, బ్యుటిరేట్‌ ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి కావడంతో వాళ్లలో బీపీ అదుపులోకి వచ్చిందట. సో, మున్ముందు సప్లిమెంట్లతోనే బీపీనీ తగ్గించుకోవచ్చన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..