ఈ శిల్పాలు సాగుతాయి

ఇక్కడున్న ఫొటోల్ని చూడగానే ‘ఓ పక్క చెట్టు మొద్దూ, హ్యాండ్‌ బ్యాగూ, చక్కని శిల్పమూ, పొడవాటి కూజా, కోక్‌ టిన్నూ, బర్గరూ కనిపిస్తున్నాయి. మరో పక్క అవే వస్తువులు అలా సాగుతూ ఉన్నాయేంటీ, ఎందుకలా’ అనుకుంటున్నారా... ఎందుకంటే అవన్నీ నిజమైన వస్తువులూ, ఆహారపదార్థాలూ కావు,

Published : 24 Apr 2022 00:09 IST

ఈ శిల్పాలు సాగుతాయి

ఇక్కడున్న ఫొటోల్ని చూడగానే ‘ఓ పక్క చెట్టు మొద్దూ, హ్యాండ్‌ బ్యాగూ, చక్కని శిల్పమూ, పొడవాటి కూజా, కోక్‌ టిన్నూ, బర్గరూ కనిపిస్తున్నాయి. మరో పక్క అవే వస్తువులు అలా సాగుతూ ఉన్నాయేంటీ, ఎందుకలా’ అనుకుంటున్నారా... ఎందుకంటే అవన్నీ నిజమైన వస్తువులూ, ఆహారపదార్థాలూ కావు, ‘ఫ్లెక్సిబుల్‌ పేపర్‌ స్కల్‌ప్చర్స్‌’. కొందరు ఆర్టిస్టులు పేపర్‌తోనే ఇలా అద్భుతమైన కళాఖండాల్ని సృష్టిస్తున్నారు. మామూలుగా చూస్తే ఈ కళారూపాలన్నీ వస్తువుల్లా ఉంటాయా... దగ్గరకు వెళ్లి పైకి ఎత్తామంటే మాత్రం ఇదిగో ఫొటోల్లో ఉన్నట్టు పొరలుపొరలుగా వస్తూ భలేగా కనిపిస్తాయి. ఈ సాగే కాగితపు బొమ్మలు చూడ్డానికి సరదాగా అనిపిస్తున్నా...
చేయడం మాత్రం చాలా కష్టమేనండోయ్‌. ముందుగా కొన్ని వందల కాగితాలను తీసుకుని ఒకదానిమీద ఒకటి పెడుతూ గమ్‌తో అతికిస్తారు. అలా తయారుచేసుకున్న కాగితపు కట్టల్ని చేయాల్సిన బొమ్మ ఎత్తూ, వెడల్పులను బట్టి పేపర్‌కటింగ్‌ మెషీన్‌తో నిదానంగా చెక్కుతూ అందమైన బొమ్మగా తీర్చిదిద్దుతారు. ఏది ఏమైనా, స్లింకీ బొమ్మలా కదిలే ఈ కాగితపు బొమ్మలు ఎంతో చిత్రంగా ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..