ఎముకల దృఢత్వానికి..!

మహిళలు ప్రొటీన్‌ను ఎక్కువగా తీసుకోవడంతోపాటు టీ లేదా కాఫీలు తాగడంవల్ల కూడా ఎముకల ఆరోగ్యం బాగుంటుందనీ, విరిగే ప్రమాదం తక్కువనీ చెబుతున్నారు లీడ్స్‌ యూనివర్సిటీ నిపుణులు

Published : 18 Dec 2022 00:52 IST

ఎముకల దృఢత్వానికి..!

మహిళలు ప్రొటీన్‌ను ఎక్కువగా తీసుకోవడంతోపాటు టీ లేదా కాఫీలు తాగడంవల్ల కూడా ఎముకల ఆరోగ్యం బాగుంటుందనీ, విరిగే ప్రమాదం తక్కువనీ చెబుతున్నారు లీడ్స్‌ యూనివర్సిటీ నిపుణులు. రోజువారీ తీసుకునేదానికన్నా 25 గ్రా. ప్రొటీన్‌ను అదనంగా తీసుకుంటే ఎంతో మంచిదట. అది కూడా మాంసం, పాలు, గుడ్లు, బీన్స్‌, నట్స్‌, చిక్కుళ్లు... ఇలా ఏ రూపంలో తీసుకున్నా మంచిదేనట. మూడు లేదా నాలుగు గుడ్ల నుంచి సుమారు 25 గ్రా. ప్రొటీన్‌ లభ్యమవుతుంది. అలాగే వంద గ్రా. టోఫు నుంచి సుమారు 17 గ్రా. ప్రొటీన్‌ లభ్యమవుతుంది. ముఖ్యంగా మధ్య వయసు మహిళల్లో ప్రొటీన్‌ ఆహారాన్ని బాగా తీసుకునేవాళ్లలో తుంటి ఎముక విరిగే ప్రమాదం బాగా తగ్గుతుంది అంటున్నారు. యాభై దాటిన మహిళల్లో ఎక్కువమంది ఏ బాత్రూమ్‌లోనో పడిపోవడంతో తుంటి ఎముక విరగడం కారణంగానే అనారోగ్యం పాలై త్వరగా మరణిస్తున్నట్లు గుర్తించారు. ప్రొటీన్‌ ఎక్కువగా తీసుకుంటే ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ముఖ్యంగా బరువు తక్కువగా ఉండేవాళ్లకి ఈ ప్రొటీన్‌వల్ల మరింత ఫలితం ఉంటుంది.
సాధారణంగా శరీర బరువుని బట్టి కిలోకి 0.8 గ్రా. ప్రొటీన్‌ రోజువారీ అవసరమవుతుంది. అలాగని కిలో బరువుకి ఒక గ్రాముకన్నా ఎక్కువ తీసుకోవడమూ మంచిది కాదు అంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..