విందు భోజనంలాంటి అన్నదానం!

వేడివేడి అన్నం... దాంతోపాటూ కూర, పులుసు, పచ్చడి, వేపుడు, పెరుగు, సాంబారు, స్వీటు లేదా జ్యూసు- ఏ రకంగా చూసినా ఓ మంచి శాకాహార విందు భోజనం అది!

Published : 17 Dec 2022 23:27 IST

విందు భోజనంలాంటి అన్నదానం!

వేడివేడి అన్నం... దాంతోపాటూ కూర, పులుసు, పచ్చడి, వేపుడు, పెరుగు, సాంబారు, స్వీటు లేదా జ్యూసు- ఏ రకంగా చూసినా ఓ మంచి శాకాహార విందు భోజనం అది! అంతటి రుచికరమైన విందును దారినపోయేవారికోసం ఉచితంగా ఏర్పాటు చేస్తోంది చెన్నైలోని ట్యాబ్లెట్స్‌ ఇండియా ఫౌండేషన్‌. అన్నదానం కదాని... ఏదో ఆషామాషీగా చేయరిక్కడ. వచ్చినవాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తారు. టేబుళ్ల ఎదుట కూర్చోబెట్టి మినరల్‌ వాటర్‌ ఉంచుతారు. చక్కగా అరిటాకేసి భోజనం వడ్డిస్తారు. భోజనానికి వచ్చేవాళ్ళ పట్ల చికాకూ, చిన్నచూపు వంటివేమీ ప్రదర్శించకుండా- పరిసరాల శుభ్రతనూ, వ్యక్తిగత పరిశుభ్రతనూ పక్కాగా పాటించేలా అక్కడి సిబ్బందికి తర్ఫీదునిచ్చారు. రోజూ మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడుగంటల దాకా ఈ కేంద్రాల్ని తెరిచి ఉంచుతారు. పేదవాళ్ల సంఖ్య కాస్త ఎక్కువగా ఉండే తండయార్‌పేట, సామియార్‌ మఠం, ఎంకేబీ నగర్‌, ప్రముఖ పర్యటక ప్రాంతం మహాబలిపురంలోనూ, పాండిచ్చేరిలోనూ- ఈ అన్నదాన కేంద్రాల ద్వారా రోజుకి 4000 మంది ఆకలి తీర్చుతోంది ట్యాబ్లెట్స్‌ ఇండియా ఫౌండేషన్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు