హహ్హహ్హ

పంకజం: వదినా, నీ చీర చాలా బాగుంది.

Published : 25 Sep 2022 00:16 IST

హహ్హహ్హ

అదీ అబద్ధమేలే

పంకజం: వదినా, నీ చీర చాలా బాగుంది.

వనజ: థ్యాంక్స్‌ వదినా... నువ్వు కూడా మంచి చీర కట్టుకుంటే నేనూ పొగుడుదును.

పంకజం: ఓస్‌ అంతేనా, నువ్వూ నాలాగే అబద్ధం చెప్పూ!


ఆమె ఎవరు

న్యాయమూర్తి: మీ ఆయన్ని ఎందుకు చంపేశావు...

ఆమె: నా కళ్లజోడు ఎక్కడ ఉంది సంగీతా అని అడిగారండీ...

న్యాయవాది: దానికే చంపేస్తారా...

ఆమె: నా పేరు రచన సార్‌.


కడగడం ఎందుకని...

అత్తగారు: చేపలకూరేంటీ వాసన వస్తోంది. వండేముందు సరిగా కడగలేదా?

కోడలు: చేపలు ఎప్పుడూ నీళ్లల్లోనే కదా ఉండేదని కడగలేదు అత్తయ్యా...


పళ్లు పదునుగా లేవు

సుధ: డాక్టర్‌ గారూ మా కుక్క పళ్లు చూడాలండీ.

డాక్టర్‌: ఏమైందీ, బాగానే ఉన్నాయిగా!

సుధ:కాదండీ, దాని పళ్లు పదునుగా లేవు. అది నిన్న మా అత్తగారిని కరిచింది. కనీసం గాటు కూడా పడలేదు.


మానవత్వం లేదు...

భర్త: తలనొప్పిగా ఉంది. పక్కింటి వాళ్లని అడిగి ట్యాబ్లెట్టో, బామో తీసుకురా.

భార్య: సరేనండీ...

కాసేపటికి ఖాళీ చేతులతో వచ్చింది భార్య...

భర్త: ఏంటీ, ఎవరూ ఇవ్వలేదా?

భార్య: లేదండీ, ఈ మనుషులకి అసలు మానవత్వమే లేదు, పిసినారి తనం ఎక్కువైపోతోంది. 

భర్త: ఏం చేస్తాం... సొరుగులో ఉన్న బామ్‌ తీసుకురా రాసుకుంటా.


అలాంటివాణ్ని కాదు

భార్య: ఏంటండీ ఇంజెక్షన్‌ చేయించుకుని అలా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వస్తున్నారు.

వెంగళప్ప: ఇంజెక్షన్‌ చేశాక నర్స్‌ నడుం మీద బాగా రుద్దమంది. నేను అలాంటి వాడిని కాదని చెప్పి వస్తున్నా.


ఎప్పుడు పోతావ్‌?

భార్య: నేనంటే మీకు ఎంత ఇష్టం...

భర్త: నువ్వు నా ప్రాణం తెలుసా... నిన్ను మహారాణిలా చూసుకోవాలనేదే నా కోరిక...

భార్య:మరి నేను చనిపోయాక నా గుర్తుగా మరో తాజ్‌మహల్‌ని కట్టిస్తారా...

భర్త: ఇప్పటికే స్థలం కూడా చూసిపెట్టా డియర్‌... నీదే ఆలస్యం.


సినిమాల్లోనే...

చంటి: నేను కొన్నేళ్ల క్రితం అమ్మ కొట్టిందని ఇంట్లోంచి పారిపోయా తెలుసా...

బంటి: ఆ తరువాత ఏమయ్యింది...

చింటూ: ఏమీ కాలేదు... కొంచెం దూరం వెళ్లేసరికి ఆయాసం వచ్చింది. ఆ తరువాత అర్థమైంది.

బంటి ఏమనీ...

చింటూ: పరుగెత్తుతూ పరుగెత్తుతూ పెద్దవడం అనేది కేవలం సినిమాల్లోనే చూపిస్తారని. అందుకే జాగ్రత్తగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేశా.


ఆవిడ పేల్చింది

రామారావు: ఈ మధ్య ఫోన్లు పేలుతున్నాయి తెలుసా...

వెంకట్రావు: అవును... ఈ మధ్యే నా ఫోను కూడా పేలిపోయింది. 

రామారావు: ఎలా పేలింది...

వెంకట్రావు: నా పాస్‌వర్డ్‌ మా ఆవిడకు తెలిసిందంతే.. ఆ తరువాత ఏం జరిగిందో చెప్పక్కర్లేదుగా...


బాగా పనిచేశాయట!

భార్య: ఏవండీ, ఫస్ట్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పనా? బ్యాడ్‌ న్యూస్‌ చెప్పనా?

భర్త: ముందు గుడ్‌ న్యూసే చెప్పూ...

భార్య: నిన్న మా ఫ్రెండ్‌ వాళ్లు తీసుకెళ్లిన మన కొత్త కారులో ఎయిర్‌ బ్యాగ్స్‌ బాగా పనిచేశాయటండీ.


నిజమే చెప్పా!

భర్తకి ఫోన్‌ వస్తే లిఫ్ట్‌ చేసింది రమణి.

బాస్‌: హలో... విజయ్‌...

రమణి: ఆయన టిఫిన్‌ చేస్తున్నారండీ!

గంట తరవాత...

బాస్‌: హలో విజయ్‌...

రమణి: ఆయన టిఫిన్‌ తింటున్నారండీ...

బాస్‌: అదేంటండీ గంట క్రితం కూడా అదే మాట చెప్పారు...

రమణి:లేదండీ... గంట క్రితం టిఫిన్‌ ప్రిపేర్‌ చేశారు... చేసింది ఇప్పుడు తింటున్నారు. నేను నిజమే చెప్పా.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..