హహ్హహ్హ

వెంగళప్పకి ఆపరేషన్‌ అయింది. బయటకొచ్చిన డాక్టరు ఇలా అన్నాడు. డాక్టర్‌: మరేం ఫర్వాలేదమ్మా... మీ ఆయనకి ఇంకాసేపట్లో తెలివి వస్తుంది.

Updated : 24 Jul 2022 05:45 IST

హహ్హహ్హ

లేని తెలివి ఎలా వస్తుంది?

వెంగళప్పకి ఆపరేషన్‌ అయింది. బయటకొచ్చిన డాక్టరు ఇలా అన్నాడు.
డాక్టర్‌: మరేం ఫర్వాలేదమ్మా... మీ ఆయనకి ఇంకాసేపట్లో తెలివి వస్తుంది.
భార్య: నేను నమ్మను డాక్టర్‌...
డాక్టర్‌: ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌గా చెబుతున్నా... అతని కండిషన్‌ బాగానే ఉంది.
భార్య: కావచ్చు డాక్టరుగారూ... ఇంత కాలం లేని తెలివి ఇప్పుడెలా వస్తుంది?


మిమ్మల్నే అడగమంది!

భార్య: ఏవండీ పక్కింటావిడ కొత్త చీర తీసుకుంది.
భర్త: అవునా... నువ్వు కూడా తీసుకో. ఇంతకీ ఆ చీర రేట్‌ ఎంత? డబ్బులిస్తా...
భార్య: అదే నేనూ అడిగితే... నాకేం తెలుసు మీ ఆయన్ని అడుగు అంది!!


నాకంటే నయమే

ఇద్దరు ఐటీ ఉద్యోగులు ఇలా మాట్లాడుకుంటున్నారు!
అజయ్‌: చిన్న గొడవైతే చాలు మా ఆవిడ పొలోమంటూ పుట్టింటికి అప్‌లోడై పోతోంది బ్రో.
విజయ్‌: ఓస్‌ అంతేనా, మా ఆవిడైతే తన పేరెంట్స్‌నే డౌన్లోడ్‌ చేస్తోంది బ్రో. నాకంటే నీ పరిస్థితే బెటర్‌.  


అదీ సంగతి!

కొడుకు: అమ్మా, మా టీచర్‌ రవితేజ, మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, నేను... ఒకటే అంది తెలుసా.
తల్లి: అవునా, ఇంతకూ మీ టీచర్‌ ఏమంది?
కొడుకు: ఇడియట్‌, దేశముదురు, పోకిరి అందమ్మా.


మందు కొడదామని...

ఆఫీసులో వారం రోజులు సెలవు దొరికిందని ఊరెళ్లి చిన్ననాటి స్నేహితుణ్ని కలిశా. నన్ను చూడగానే గట్టిగా హత్తుకుని, సంతోషంతో- పదరా చాలా రోజుల తరవాత వచ్చావు, మందు కొడదామన్నాడు. నేను ఎగిరి గంతేశా. తీరా చూస్తే పొలానికి తీసుకెళ్లి చేనుకి మందు కొట్టించాడు వెధవ.


పూజకు ఫ్రూట్‌ జామ్‌

కొత్త కోడలితో అత్తగారు వరలక్ష్మీ వ్రతం చేయిస్తోంది.
అత్తగారు: తమలపాకు మీద ఆ ఎర్రని ముద్ద ఏంటీ?
కోడలు: అదా అత్తమ్మా... ‘పూజ కోసం ఐదు రకాల పండ్లు దొరకడం లేదూ’ అంటే... ‘మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ జామ్‌ పెట్టు ఫరవాలేదు’ అని చెప్పింది నా ఫ్రెండ్‌. అందుకే పెట్టా.


ఫొటో బాలేదనీ...

కారు దిగి పోలీసులకు లంచం ఇచ్చి వచ్చిందో భార్య.
భర్త: అదేంటీ... పోలీసులకు ఫైన్‌ కట్టావ్‌... నీ దగ్గర డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందిగా.
భార్య: ఉందండీ... కానీ అందులో నా ఫొటో బాలేదు. అందుకే చూపించలేదు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..