సిల్లీపాయింట్‌

మనుషులకి తోకలుండి... పరిణామక్రమంలో అదృశ్యమైనట్టే కోళ్ళకి ఒకప్పుడు పళ్లు ఉండేవట.

Updated : 13 Nov 2022 04:22 IST

సిల్లీపాయింట్‌

నుషులకి తోకలుండి... పరిణామక్రమంలో అదృశ్యమైనట్టే కోళ్ళకి ఒకప్పుడు పళ్లు ఉండేవట.

* గ్రీకు దేశంలో గర్భసంచిని (యుటరస్‌) హిస్టెరా అంటారు. ప్రసవం తర్వాత కొందరు స్త్రీలలో ఏర్పడే కుంగుబాటు లక్షణాలని (పోస్ట్‌పార్టెమ్‌ డిప్రెషన్‌) ‘హిస్టీరియా’ అనడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కనిపెట్టిన తీవ్ర మానసిక సమస్యకీ ఆ పేరే పెట్టారు!

* బ్రిటిష్‌ రాజవంశంలోని వాళ్లెవరూ ఉల్లిపాయ, నీరుల్లితో చేసిన ఆహారం తినకూడదనే నియమం ఉంది. కొత్తగా ఎవరైనా ఆ కుటుంబంలోకి వస్తే... వాళ్ళు ఒకపూట మాత్రం పాత ఆహారాన్ని తినొచ్చు... అదీ కొన్ని నెలల వరకు. తర్వాత అది కూడా మానేయాలి!

* ఆస్ట్రేలియాలో 80 శాతం మంది రోజూ ఏదోరకమైన జూదం ఆడతారట. ఆ విషయంలో ఆ దేశమే టాప్‌!

* సెల్ఫీలూ, వీడియో కాల్సూ ఎంత పెరిగితేనేం... ఇప్పటికీ 70 శాతం అమ్మాయిల్లో కెమెరా షై-నెస్‌ పోలేదట!

* రోమన్‌ల కాలంలో సామూహిక స్నానాల గది పద్ధతే ఉండేది. స్త్రీలూ పురుషులూ వేర్వేరుగా వాళ్ళకి దగ్గరైన బంధువులతో కలిసే స్నానాలు చేసేవారు. ఒకటో శతాబ్దంలో రోమన్‌లు ఇంగ్లండుని జయించినప్పుడు అక్కడా ఇలాంటి ఓ పెద్ద స్నానాల ప్రాంగణాన్ని కట్టించారు. ‘బాత్‌’ పేరుతో ఇప్పుడదో పెద్ద నగరంగా మారింది!

* తిమింగలం, డాల్ఫిన్‌లకి పుట్టుకతోనే కొద్దిగా జుట్టు ఉంటుంది కానీ... ఎదిగేకొద్దీ పోతుంది.

* ఆవులూ, గొర్రెలూ, గుర్రాలూ, కుక్కలూ, ఒంటెలూ... ఇవన్నీ నాలుగువేల ఏళ్ళ కిందటే మనిషి జీవితంలో భాగమైపోయాయి. ఆ తర్వాత మరే జంతుజాతీ ఆ స్థాయిలో మచ్చిక కాలేదు!

* అమెరికాలోని లాస్‌ వేగాస్‌లో ఉన్న ప్యారిస్‌ లాస్‌ వేగాస్‌ హోటల్‌, చైనాలోని హాంగ్‌ జూ... ఈ రెండింటికీ ఓ సామ్యముంది. ఆ రెండు చోట్లా... ప్యారిస్‌ ఈఫిల్‌ టవర్‌ని పోలిన నకళ్ళుంటాయి!

* అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి... అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉంటుందట.


ప్రధాని నరేంద్రమోదీ ఉపయోగించే కారు... నాలుగు చక్రాలూ పంక్చరైనా సరే 90 కి.మీ. వేగంతో 350 కి.మీ. దూరం వరకూ వెళ్ళగలదు!


దేమిటో గానీ... టి20 ప్రపంచకప్‌ పోటీలకి ఆతిథ్యమిచ్చిన ఏ దేశం కూడా ఆ కప్పుని గెలిచింది లేదు!


పులుల అభయారణ్యం దగ్గరున్న ప్రజలు మనిషి ముఖాన్ని పోలిన మాస్కుని తల వెనకభాగాన ధరిస్తుంటారు. ఇలాచేస్తే పులి వెనక నుంచి దాడి చేయకుండా ఉంటుందట!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..