తేయాకు తోటల్లో... అందంగా ఆహ్లాదంగా!

సముద్ర తీరాల్లో,  పార్కుల్లో చెర్రీ పూల చెట్లను పెంచడం... అవి నిండుగా పూసినప్పుడు వాటి మధ్య నిల్చుని ఫొటోలు దిగి మురిసిపోవడం అనేది విదేశాల్లో ఉన్నదే.

Published : 06 May 2023 23:56 IST

తేయాకు తోటల్లో... అందంగా ఆహ్లాదంగా!

ముద్ర తీరాల్లో,  పార్కుల్లో చెర్రీ పూల చెట్లను పెంచడం... అవి నిండుగా పూసినప్పుడు వాటి మధ్య నిల్చుని ఫొటోలు దిగి మురిసిపోవడం అనేది విదేశాల్లో ఉన్నదే. ఆనీ అందులోనూ కాస్త వైవిధ్యం చూపాలనుకున్న చైనా వాసులు వాటిని రంగురంగుల్లో.. పచ్చని తేయాకుల తోటల మధ్య అందంగా పెంచేయడంతో ఇప్పుడా తోటలు పర్యటక ప్రాంతంగా మారిపోయాయి తెలుసా... ఈ సుందరమైన దృశ్యాన్ని చూడాలంటే చైనా, ఝంగ్‌పింగ్‌లో ఉన్న ఫుజియన్‌ ప్రావిన్స్‌కు వెళ్లాల్సిందే. ఇక్కడ కొన్ని వేల ఎకరాల్లో విస్తరించిన టీతోటల మధ్య... సుమారు నలభై రకాల్లో లక్షకు పైగా చెర్రీ చెట్లను అక్కడక్కడా ఓ పద్ధతి ప్రకారం పెంచేశారట. దాంతో జనవరి నుంచి మార్చి చివరి వరకూ ఆ పూలన్నీ చక్కగా విరబూయడంతో వాటిని చూసేందుకే కాదు... ఆ చెట్లూ, తోటల మధ్య నిల్చుని ఫొటోలు దిగేందుకూ పర్యాటకులు బారులు తీరతారని ప్రత్యేకంగా చెప్పాలా..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..