బ్యాగుకి... పాలరాతి అందం

ఇదివరకు ఇంటి గచ్చుపైనే ఉండే పాలరాయి... ఈమధ్య ఇల్లంతా కనిపించేస్తోంది. డైనింగ్‌ టేబుల్‌ మొదలు మొక్కల కుండీల వరకూ అన్నీ పాలరాయి మెరుపులతో నిండిపోతున్నాయి

Published : 07 May 2023 00:37 IST

బ్యాగుకి... పాలరాతి అందం

ఇదివరకు ఇంటి గచ్చుపైనే ఉండే పాలరాయి... ఈమధ్య ఇల్లంతా కనిపించేస్తోంది. డైనింగ్‌ టేబుల్‌ మొదలు మొక్కల కుండీల వరకూ అన్నీ పాలరాయి మెరుపులతో నిండిపోతున్నాయి. చూడగానే ఆకట్టుకునే దాని అందాలు అందర్నీ అంతలా ఆకర్షిస్తున్నాయి కాబట్టే- ఇప్పుడు ఫ్యాషన్‌ రంగంలోకీ ప్రవేశించిందది. అమ్మాయిల చేతుల్లో ఒదిగిపోయే హ్యాండ్‌బ్యాగ్‌లపైకీ పాకిపోయింది. తెలుపు, నలుపు, గులాబీ, ఆకుపచ్చ, నీలం... ఇలా చూడచక్కని రంగుల్లో లెదర్‌, పాలీసింథటిక్‌ లెదర్‌ క్లాత్‌లతో వస్తున్న ఈ మార్బుల్‌ ప్రింట్లు... నిజమైన పాలరాతిని తలపిస్తోంది. బ్యాగు హుందాగానూ, కొత్తగానూ ఉండాలనుకునేవారు ఈ మార్బుల్‌ ప్రింట్‌ బ్యాగుని తప్పక ప్రయత్నించొచ్చు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..