ఈ ఐస్‌క్యూబ్స్‌ కరిగిపోవు!

ఎండాకాలం వచ్చేసింది. ఈ వేడివేడి వాతావరణంలో ఎవరికైనా సరే, కాస్త చల్లచల్లగా తాగాలనే ఉంటుంది. అందుకే ఇంటికొచ్చిన అతిథులకు టీ, కాఫీలకు బదులు పండ్లరసాలూ, ఫలుదా, మజ్జిగా, బాదం మిల్క్‌ లాంటివి చేసి ఇస్తుంటారు

Published : 07 May 2023 00:42 IST

ఈ ఐస్‌క్యూబ్స్‌ కరిగిపోవు!

ఎండాకాలం వచ్చేసింది. ఈ వేడివేడి వాతావరణంలో ఎవరికైనా సరే, కాస్త చల్లచల్లగా తాగాలనే ఉంటుంది. అందుకే ఇంటికొచ్చిన అతిథులకు టీ, కాఫీలకు బదులు పండ్లరసాలూ, ఫలుదా, మజ్జిగా, బాదం మిల్క్‌ లాంటివి చేసి ఇస్తుంటారు. అవి అప్పటికప్పుడు చల్లగా ఉండేందుకు ఆ పానీయాల్లో ఐస్‌క్యూబ్స్‌ వేసి ఇస్తుంటారు. అవి కరగడం వల్ల ఒక్కోసారి ఆ పానీయాలు పల్చబడి కాస్త రుచి తగ్గడమూ తెలిసిందే. అందుకే ఈసారి అందరూ వాడే ఆ మంచుముక్కలకు బదులు కరిగిపోని ఐస్‌క్యూబ్స్‌ వాడండి. అది సరే కానీ ‘అసలు మంచు కరగకపోవడం ఏంటీ’ అని ఆశ్చర్యపోతున్నారా... మరేం లేదండీ ఇవి రీయూజబుల్‌ ఐస్‌క్యూబ్స్‌. ప్లాస్టిక్‌, మెటల్‌, స్టోన్‌... ఇలా రకరకాలుగా, రంగురంగుల్లో, వెరైటీ ఆకారాల్లో దొరుకుతున్నాయి. వీటిల్లో నీళ్లు నింపేలా కొన్నీ, జెల్‌తో వచ్చినవి మరికొన్నీ ఉంటాయి. ఓ గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచి కావాల్సిన పానీయంలో వేశామంటే... దాన్ని చల్లగా మార్చేస్తాయివి. ఈ క్యూబ్స్‌... మామూలు ఐస్‌క్యూబ్స్‌ కన్నా ఎక్కువసేపు చల్లదనాన్ని ఇస్తాయి. పైగా వాటిని కడిగి ఫ్రిజ్‌లో ఉంచేసి కావాల్సినప్పుడు మళ్లీ వాడుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు