అతికించే అరలు

కాస్త ఇరుగ్గా ఉన్న ఇంట్లో సామాన్లు సర్దుకోవడానికి అరలు సరిపోవు. బయట అవి ఎక్కడ పెట్టినా చూడ్డానికి బాగోదు.

Updated : 21 May 2023 04:09 IST

కాస్త ఇరుగ్గా ఉన్న ఇంట్లో సామాన్లు సర్దుకోవడానికి అరలు సరిపోవు. బయట అవి ఎక్కడ పెట్టినా చూడ్డానికి బాగోదు. అందుకే అలాంటి వారు అందంగా పొందిగ్గా సర్దుకోవడానికి వచ్చాయి మ్యాగ్నెట్‌ అరలు. వీటిని ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషీన్‌, ఓవెన్‌, ఇనుప బీరువా వంటి వాటికి అతికించుకోవచ్చు. చక్కగా పారదర్శకంగా ఉండే సీసాల్లో పదార్థాలను నింపి, వరసక్రమంలో పేర్చితే చూడ్డానికి బాగుంటుంది. వంటగదిలో అవసరమైన పదార్థాలు ఫ్రిజ్‌కు అతికించిన అరలో సర్దేయొచ్చు. సర్ఫ్‌, డిటర్జెంట్‌ లిక్విడ్లు, ఇతర క్లీనింగ్‌ సామగ్రిని వాషింగ్‌మెషీన్‌ దగ్గర పెట్టేయొచ్చు. అరను అతికించిన గదిని బట్టి సామానులు పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఓ ఐదారు అరలు తెచ్చిపెట్టుకుంటే అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. లేదంటే తీసి దాచిపెట్టేయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..