పాపాయి గుర్తుగా పొదుపు ఖాతాలు

ఈ మధ్య చాలామంది ఆడపిల్లను సాక్షాత్తూ లక్ష్మీ దేవిగా భావిస్తున్నారు. హాస్పిటల్‌లో కళ్లు తెరిచిన చిట్టిపాపాయిని ఎంతో ఆర్భాటంగా ఇంటికి ఆహ్వానిస్తున్నారు.

Published : 04 Feb 2023 23:41 IST

పాపాయి గుర్తుగా పొదుపు ఖాతాలు

మధ్య చాలామంది ఆడపిల్లను సాక్షాత్తూ లక్ష్మీ దేవిగా భావిస్తున్నారు. హాస్పిటల్‌లో కళ్లు తెరిచిన చిట్టిపాపాయిని ఎంతో ఆర్భాటంగా ఇంటికి ఆహ్వానిస్తున్నారు. ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్లు చేసే ఏర్పాట్లను మనం చాలానే చూశాం. అయితే ఔరంగాబాద్‌ జిల్లా గోలేగావ్‌కి చెందిన ప్రవీణ్‌ జోడ్‌- విద్యా దంపతులు మాత్రం తమకు కూతురు పుట్టిన సందర్భంగా ఏదైనా చేయాలనుకున్నారు. అది నలుగురికి మంచి చేసేదైతే బాగుంటుందని ఆలోచించిన ప్రవీణ్‌ దంపతులు- ఐదేళ్ల లోపున్న ముప్ఫైమంది పేదింటి ఆడపిల్లల పేరిట సుకన్యా సమృద్ధి యోజన ఖాతాలను తెరిచారు. నెలకి వెయ్యి రూపాయల చొప్పున ఆ పిల్లలకు పదిహేనేళ్లు వచ్చేవరకూ వారి పేరిట డబ్బు జమ చేసి ఆర్థిక భరోసానివ్వడానికి ముందుకొచ్చారు. ప్రభుత్వోద్యోగులైన ఈ దంపతులు భద్రతతో కూడిన పొదుపు పథకాలను పరిచయం చేసి అమ్మాయిల చదువులూ, పెళ్లిళ్ల కోసం డబ్బు దాచుకునేలా పల్లె ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..