రోజుకు 60 లీటర్ల పాలు

పాలను అత్యధికంగా ఉత్పత్తి చేయడంలో ముందుంటాయి ముర్రా, గిర్‌, సహివాల్‌, హరియాణా తదితర దేశీ పశువులు. అయితే ఇవి అన్ని రకాల వాతావరణాల్నీ తట్టుకోలేవు.

Published : 04 Feb 2023 23:43 IST

రోజుకు 60 లీటర్ల పాలు

పాలను అత్యధికంగా ఉత్పత్తి చేయడంలో ముందుంటాయి ముర్రా, గిర్‌, సహివాల్‌, హరియాణా తదితర దేశీ పశువులు. అయితే ఇవి అన్ని రకాల వాతావరణాల్నీ తట్టుకోలేవు. అనుకూలంగా లేని వాతావరణంలో పాలు సరిగా ఇవ్వవు. వీటన్నింటికీ పూర్తి భిన్నమైంది... లాలా లజ్‌పత్‌ రాయ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు సృష్టించిన హార్దేను పశువు. దాదాపు 50-60 లీటర్ల పాలిచ్చే ఈ పశువు- హాల్‌ స్టైన్‌ ఫ్రిజెన్‌(ఉత్తర అమెరికా జాతి), స్థానిక హరియాణా, సహివాల్‌ జాతుల క్రాస్‌ బ్రీడ్‌. పుట్టిన 20నెలలకే సంతానోత్పతికి సిద్ధమయ్యే హార్దేను రైతులకు సిరులు కురిపిస్తుంది. అన్ని వాతావరణాలనూ తట్టుకుని పాలు ఇవ్వడం దీని ప్రత్యేకత. హరియాణాలో పాడిరైతులకు వరంగా మారిన హార్దేను పశువులకు ఇతర రాష్ట్రాల్లోనూ మాంచి డిమాండ్‌ ఉండటంతో లాలా లజ్‌పత్‌ రాయ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మరిన్ని పశువుల్ని వృద్ధి చేసే పనిలో ఉన్నారు. వీర్యాన్ని కూడా యూనివర్సిటీ నుంచే విక్రయిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..