కాళ్లు... చాలు

చాలామందికి చికెన్‌ అనగానే లెగ్‌పీసులే గుర్తొస్తాయి.  పట్టుకోవడానికి వీలుగానూ, రుచిగానూ ఉండే వాటిని పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు.

Published : 07 May 2023 00:01 IST

కాళ్లు... చాలు

చాలామందికి చికెన్‌ అనగానే లెగ్‌పీసులే గుర్తొస్తాయి.  పట్టుకోవడానికి వీలుగానూ, రుచిగానూ ఉండే వాటిని పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. అయితే ఆ లెగ్‌ పీస్‌లను రెండు సార్లు కొరికి తింటే చాలు ఖాళీ అయిపోయి ఎముక మిగులుతుంది. అదే ఉత్తర వియత్నాంలో డాంగ్‌ టావో కోళ్ల లెగ్‌ పీస్‌లు అలాకాదు. ఒక్క పీస్‌ తింటే చాలు, ఆకలి తీరిపోతుందట. కేవలం లెగ్‌పీస్‌లకోసమే పెంచే ఈ కోళ్ల బాహుబలి కాళ్లకు అక్కడ యమా డిమాండ్‌. అన్నం- మొక్కజొన్నలు వేసి పెంచే డాంగ్‌ టావో కోళ్ల కాళ్లు చాలా లావుగా ఉంటాయి. ఒక్కో కోడి నాలుగు నుంచి ఐదు కేజీలు తూగితే అందులో అయిదో వంతు బరువు వాటి కాళ్లదే. రుచి కూడా చాలా బాగుంటుందట. ఇంతకీ దాని ధర ఎంతో తెలుసా.... లక్షరూపాయల పైమాటేనట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..