ఎగిరే తరగతి గది

సహజంగానే విమానాల పట్ల చిన్నారులు ఇట్టే ఆకర్షితులవుతారు. అందుకే ఓ వయసొచ్చాక కెరీర్‌ను నిర్దేశించుకోవాల్సిన చిన్నారులకు బ్రిటన్‌లోని కార్న్‌ఫీల్డ్‌ యూనివర్సిటీ ముందుగానే లక్ష్యాన్ని ఏర్పరిచే పనిలో పడింది

Published : 07 May 2023 00:04 IST

ఎగిరే తరగతి గది

సహజంగానే విమానాల పట్ల చిన్నారులు ఇట్టే ఆకర్షితులవుతారు. అందుకే ఓ వయసొచ్చాక కెరీర్‌ను నిర్దేశించుకోవాల్సిన చిన్నారులకు బ్రిటన్‌లోని కార్న్‌ఫీల్డ్‌ యూనివర్సిటీ ముందుగానే లక్ష్యాన్ని ఏర్పరిచే పనిలో పడింది. అందుకు కారణం అక్కడి విమానయాన సంస్థలు ఉద్యోగుల కొరతను ఎదుర్కోవడమే. విమాన డిజైనింగ్‌, తయారీ, విడిభాగాల పరిశ్రమల్లో పనిచేసేవారి సంఖ్య తగ్గిపోవడంతో కార్న్‌ఫీల్డ్‌ యూనివర్సిటీ- బెన్‌మత్‌ విమానాశ్రయంలో నేషనల్‌ ఫ్లయింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి- ఓ విమానాన్ని తరగతి గదిలా మార్చేసింది. అక్కడికొచ్చే పాఠశాల స్థాయి విద్యార్థులకు విమానాల గురించి అవగాహన కల్పిస్తూ... ఆ రంగంలోని ఉద్యోగావకాశాలను పరిచయం చేస్తూ వారిలో విమానయాన రంగం పట్ల ఆసక్తిని రేకెత్తిస్తున్నారు నిపుణులు. పిల్లల్ని ఆకాశంలో విహరింపజేస్తూ పాఠాలు చెబుతున్న ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగులు చిన్నారులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తూ కొత్త ప్రపంచానికి తీసుకెళుతున్నారు. ఆ రంగంలోకి రావాలనుకుంటున్న వారికి పాఠశాల స్థాయి నుంచే శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఆలోచన బాగుంది కదూ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..