‘టైటానిక్‌’లాంటి ఇల్లు

పశ్చిమ్‌ బంగలోని డార్జిలింగ్‌ జిల్లాలో ఓ మారుమూల గ్రామం నిచ్‌బారీ. సౌకర్యాలకు ఆమడ దూరంలో ఉన్న ఆ పల్లెని ఒకప్పుడు ఎవరూ పట్టించుకునేవారు కాదు.

Published : 07 May 2023 00:08 IST

‘టైటానిక్‌’లాంటి ఇల్లు

పశ్చిమ్‌ బంగలోని డార్జిలింగ్‌ జిల్లాలో ఓ మారుమూల గ్రామం నిచ్‌బారీ. సౌకర్యాలకు ఆమడ దూరంలో ఉన్న ఆ పల్లెని ఒకప్పుడు ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు మింటూ రాయ్‌ అనే సామాన్యుడి కల వల్ల అది వార్తల్లో నిలిచింది. చిన్నప్పుడు కోల్‌కతాలో టైటానిక్‌ షిప్‌ ఆకారంలో నిర్మించిన దుర్గామాత మండపాన్ని చూసిన మింటూ- ఎప్పటికైనా ఆ ఓడలాంటి ఇంటిని కట్టుకోవాలని అనుకున్నాడు. కొన్నాళ్లకి డబ్బు కూడబెట్టుకుని ఇంజినీర్లను అడిగితే.. పిచ్చోణ్ని చూసినట్లు చూశారట. ఎంతమందిని అడిగినా ఫలితం లేకపోవడంతో సొంతంగా డిజైన్‌ చేసుకుని, భార్యతో కలిసి తనే తన కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నాడు. షిప్‌ మాదిరిగా మూడంతస్తుల ఇంటి నిర్మాణాన్ని 2010లో ప్రారంభించాడు. 39 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుండే ఆ ఇంటి పనులు పూర్తికావొచ్చాయి. దాంతో ఆ టైటానిక్‌ ఇంటిని చూడటానికి చుట్టుపక్కలవారితోపాటు, కోల్‌కతా నుంచి కూడా సందర్శకులు రావడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..