ఆటోలో సీటు బెల్టు

కారులో సీటు బెల్టు ఉంటుంది. ఎక్కాక దాన్ని పెట్టుకునే వరకూ ఆటోమేటిక్‌ సంకేతాలు వస్తూనే ఉంటాయి. అదే ఆటో ఎక్కితే ‘సీట్‌ బెల్టు పెట్టుకోండి’ అని డ్రైవర్‌ చెబితే ఆశ్చర్యమేస్తుంది కదూ.

Published : 07 May 2023 00:13 IST

ఆటోలో సీటు బెల్టు

కారులో సీటు బెల్టు ఉంటుంది. ఎక్కాక దాన్ని పెట్టుకునే వరకూ ఆటోమేటిక్‌ సంకేతాలు వస్తూనే ఉంటాయి. అదే ఆటో ఎక్కితే ‘సీట్‌ బెల్టు పెట్టుకోండి’ అని డ్రైవర్‌ చెబితే ఆశ్చర్యమేస్తుంది కదూ. ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాపిడో సంస్థ ఆటోల్లోనూ సీటు బెల్టు తప్పనిసరి చేసింది. ఆటోలో ప్రయాణికుల సీటుకు రెండు వైపులా ఓపెన్‌ ఉంటుంది. పెద్ద పెద్ద గోతులు వచ్చినప్పుడూ, సడెన్‌ బ్రేకులు వేసినప్పుడూ, అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు- ముందుకు రావడం, పక్కకు పడిపోవడం జరుగుతుంది. నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని రాపిడో సంస్థ బెంగళూరులోని ఆటోలకు సీట్‌బెల్టులను ఏర్పాటుచేస్తోంది. అందుకు సంబంధించిన ధరా భారాన్ని డ్రైవర్లపైన వేయకుండా ఆ సంస్థే భరిస్తోంది. త్వరలో మిగతా నగరాల్లోనూ ఈ సీటు బెల్టులు అమల్లోకి వస్తాయట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు