ఆ బ్యాక్టీరియాకి అదే కవచం!

పొట్టభాగంలోని బ్యాక్టీరియా మందులకు లొంగకపోవడానికిగల కారణాల్ని గుర్తించారు శాస్త్రవేత్తలు.

Updated : 21 May 2023 04:27 IST

పొట్టభాగంలోని బ్యాక్టీరియా మందులకు లొంగకపోవడానికిగల కారణాల్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇవి యాంటీబయోటిక్స్‌ నుంచి రక్షించుకోవడానికి కణబాహ్యంగా ఎఫ్‌-పైలై అనే కవచాన్ని ఏర్పాటుచేసుకుంటాయి. వీటిద్వారా బ్యాక్టీరియాలు సంఘటితమై మందుల్ని ఎదుర్కొనేందుకు అవసరమైన జన్యువుల్ని మార్పిడిచేసుకుంటాయి. పొట్టలో అసాధారణ పరిస్థితులు, వేడి, ఆమ్లాలు వంటివి ఎఫ్‌-పైలైని విచ్ఛిన్నం చేసి బ్యాక్టీరియాల్లో జన్యు మార్పిడిని ఆపగలవని భావించేవారు. అయితే, ఆ కఠిన పరిస్థితుల్లోనూ జన్యువుల్ని మార్పిడి చేసుకుంటాయనీ తద్వారా అతిపెద్ద బ్యాక్టీరియా సమూహంగా ఏర్పడి యాంటీ బయోటిక్స్‌తో పోరాడతాయనీ ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు తేల్చారు. ఇ-కొలీ బ్యాక్టీరియాలో పైలై కవచాన్ని విచ్ఛిన్నం చేసే లక్ష్యంతో అవి ఉన్నచోట తీవ్ర అలజడి సృష్టించారు. ఆ అలజడికి బ్యాక్టీరియాల మధ్య జన్యు మార్పిడి మరింత పెరిగి వాటి కవచాలు సాగుతూ, స్ప్రింగ్‌లాంటి నిర్మాణంలోకి మారాయట. కవచం వెనక రహస్యం తెలిసింది కాబట్టి దాన్ని విచ్ఛిన్నం చేసే మార్గం తెలుసుకోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..