Updated : 03 Oct 2021 05:09 IST

సిల్లీ పాయింట్‌

శరీరానికి ఆక్సిజన్‌ అవసరమేంటో కరోనాతో మనకి బాగా తెలిసొచ్చింది! కానీ, మన శరీరంలో ఆక్సిజన్‌ మాత్రమే ఉండి హైడ్రోజన్‌ ‘బొత్తిగా’ లేకుంటే ఏమవుతుందో తెలుసా... ఓ బెలూన్‌లా గాల్లో తేలుతాం!

* చన్నీళ్లకన్నా వేడినీళ్ల స్నానం చేసేవాళ్లకి గోళ్లు వేగంగా పెరుగుతాయి.

* మనదేశం టీవీలకన్నా ముందు కంప్యూటర్‌లనే సొంతంగా తయారు చేసుకుంది! 1956లో రూపొందించిన వీటిని ‘ఆటోమెటిక్‌ కాలిక్యులేటర్స్‌’ అనేవాళ్లం. ఆ తర్వాతి మూడేళ్లకికానీ మనకి టీవీలు రాలేదు!

* లండన్‌లోని రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీ ఆ మధ్య ఓ చిత్రమైన లెక్క వేసింది. ఓ సగటు మనిషి శరీర నిర్మాణానికి అవసరమైన సుమారు 59 రసాయనాలని బయట కొనడానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసింది. దాని ప్రకారం... మన దేహంలోని రసాయనాల విలువ 98,30,927 రూపాయలు.

* ఆది, సోమ, మంగళ... ఇలా వారాల లెక్క 18వ శతాబ్దం నుంచే భారతదేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. గుప్తుల కాలం నుంచే మనవాళ్లకి వారాల గురించి తెలిసినా... మనం తిథులూ, ముహూర్తాలనే ఎక్కువగా పాటించేవాళ్లం!

* నేటి అంటార్కిటికానే ఒకప్పుడు ఆస్ట్రేలియా అని పిలుస్తుండేవారు. ఆ పేరుని తాము కనిపెట్టిన కొత్త భూభాగానికి బ్రిటిష్‌వాళ్లు పెట్టాక... 80 ఏళ్లపాటు ఏ పేరూ లేకుండానే ఉండిపోయింది అంటార్కిటికా. ఆ తర్వాతే... ఉత్తర ధ్రువమైన ఆర్కిటిక్‌కి వ్యతిరేకదిశలో ఉంటుందనే అర్థంలో కొత్తగా నామకరణం చేశారు. 

* గోంగూర పాలకూరలకు మల్లేనే ఒకప్పుడు తేయాకునీ వెల్లుల్లితో కలిపి కూరలాగా వండుకునేవాళ్లట ఉత్తరాదిలో!

* మిరపకాయలు... 16వ శతాబ్దంలో పోర్చుగీసుల ద్వారానే భారతదేశానికి వచ్చాయి. అది వరకు మన వంటల్లో కారం రుచికోసం మిరియాలను వాడేవాళ్లం. మిరియంలా ఘాటుగా ఉంటాయి కాబట్టే వీటిని మిరపకాయలన్నాం!

* తెలుగు సినిమా పరిశ్రమనే కాదు... బెంగాలీ సినిమాలనూ టాలీవుడ్‌ అనే అంటారు!

* అంతరిక్షంలోకి వెళితే.. మనం ఏం తిన్నా తేన్పులు రావు!

* బాలీవుడ్‌ ‘ఖాన్‌ త్రయం’ అమీర్‌, సల్మాన్‌, షారుఖ్‌ ఖాన్‌ల తాతముత్తాతలు... అఫ్గానిస్థాన్‌కి చెందినవాళ్లే!

* మన భారతప్రధాని ఏ దేశానికి వెళ్లాలన్నా వీసా అక్కర్లేదు... కానీ మనందరిలాగా పాస్‌పోర్టు తీసుకెళ్లాల్సిందే!


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని