సులభంగా ఆవకాయ పెట్టే విధానం

ముందుగా నాలుగు పొగడ్తలూ ఓ కప్పు కాఫీతో మీ భర్తను ‘పనికి’ సిద్ధం చేసుకోవాలి. నాణ్యమైన పచ్చి మామిడికాయలు పెద్దవి మచ్చలూ పుచ్చులూ లేకుండా చూసి తీసుకురమ్మని ఒక బ్యాగు ఇచ్చి మార్కెట్‌కి పంపించాలి.

Published : 06 May 2023 23:59 IST

సులభంగా ఆవకాయ పెట్టే విధానం

కావాల్సిన వస్తువులు: 1. భర్త 2. మామిడికాయలు 3. ఆవపిండి 4. ఉప్పు 5. నువ్వులనూనె  6. కారం 7. కత్తిపీట.

ముందుగా నాలుగు పొగడ్తలూ ఓ కప్పు కాఫీతో మీ భర్తను ‘పనికి’ సిద్ధం చేసుకోవాలి. నాణ్యమైన పచ్చి మామిడికాయలు పెద్దవి మచ్చలూ పుచ్చులూ లేకుండా చూసి తీసుకురమ్మని ఒక బ్యాగు ఇచ్చి మార్కెట్‌కి పంపించాలి. మార్కెట్‌ నుంచి చెమటలు కక్కుతూ వచ్చిన మీవారికి ప్రేమగా కొంగుతో ముఖం తుడిచి, గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి, ఒక లుంగీ కట్టుకోమని చెప్పి, తీసుకువచ్చిన మామిడికాయలను ముక్కలు చెయ్యమని కత్తిపీటను ఇవ్వాలి. మీరు అప్పటికే ఒలకబోసిన ప్రేమ కారణంగా మీ మాట కాదనలేక ఎదురుచెప్పలేక ఏడవలేక నవ్వుతూ ఆ పని పూర్తిచేసిన వెంటనే, ఆ ముక్కలలో ఆవపిండి, నువ్వులనూనె, ఉప్పు, కారం, తగిన పాళ్ళలో బాగా కలిపించి, ఒక శుభ్రమైన జాడీ తీసుకుని కలిపిన మిశ్రమాన్ని ఆ జాడీలో పెట్టించాలి. అంతే, ఎంతో సులభంగా మీరు ఏమాత్రం కష్టపడకుండా మామిడికాయ ఊరగాయ తయారైపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..