నలభై రోజుల క్వారంటైన్‌!

కొవిడ్‌ సమయంలో బాగా వాడుకలోకి వచ్చిన పదం క్వారంటైన్‌. ప్రపంచంలో మొదటిసారి క్వారంటైన్‌ని పాటించింది ఇటలీలోని వెనిస్‌ నగరంలోనట.

Published : 20 May 2023 23:52 IST

నలభై రోజుల క్వారంటైన్‌!

కొవిడ్‌ సమయంలో బాగా వాడుకలోకి వచ్చిన పదం క్వారంటైన్‌. ప్రపంచంలో మొదటిసారి క్వారంటైన్‌ని పాటించింది ఇటలీలోని వెనిస్‌ నగరంలోనట. అప్పట్లో అక్కడ ఒక రకమైన ప్లేగు వ్యాధి వచ్చింది. దాని విస్తరణని నియంత్రించేందుకు నగరంలోకి వచ్చే పడవుల్ని సముద్రతీరంలోనే లంగరువేసి 40 రోజులపాటు ఆగమన్నారట. అందులోని వ్యక్తులూ అన్నాళ్లూ బయటకు రావడానికి వీల్లేదన్నమాట. ఆ పరిస్థితిని క్వారంటైన్‌ అన్నారు. ఈ పదానికి మూలం కూడా ఇటలీ భాషలోనే ఉంది. ‘క్వారంటా గియోర్నీ’ అంటే ‘40 రోజులు’ అని అర్థం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..