ఆ ఐదుగురు..!
శ్రేయాఘోషాల్... పరిచయం అక్కర్లేని గాయని. దాదాపు పదకొండు భాషల్లో వివిధ సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన ఈ ప్రతిభావని.. తన విజయం వెనుక ఉన్న ఐదుగురు సంగీత దర్శకుల గురించి చెబుతోందిలా...
మణిశర్మ... నాకు తొలి హిట్ ఇచ్చారు
తెలుగులో కొన్ని వందల పాటల పాడి ఉంటా కానీ... నా మొదటి హిట్ మాత్రం ఒక్కడులోని ‘నువ్వేం మాయ చేశావో గానీ...’. ఈ రోజుకీ ఆ పాటను పాడమని తెలుగు అభిమానులు అడుగుతున్నారంటే దానికి కారణం ఆ సంగీత దర్శకుడు మణిశర్మే. ఆ తరువాత ఆయనతో కలిసి ఠాగూర్, అతడు, బాలు... ఇలా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో యాభైకి పైగానే సినిమాలు చేసిఉంటా. నాకు భాష రాకపోయినా ఏ పాట ఎలా పాడాలో, భావాలు ఎలా పలకాలో ఓపిగ్గా చెబుతూ తెలుగుభాషపైన ఉన్న భయాన్ని పోగొట్టారు. ఆ సూచనలు నాకు ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి. ఎప్పుడు రికార్డింగుకు వెళ్లినా మణిశర్మ తన ఇంటినుంచి భోజనం తెప్పించేవారు. పదార్థాల పేర్లు గుర్తులేవు కానీ... ఆ భోజనాన్ని తలచుకుంటే ఇప్పటికీ నోరూరుతుంది.
రాజా సర్ అంటే... పాట బట్టీ పట్టాల్సిందే
ఇళయరాజా ఎదురుగా నిల్చుని పాడే ఛాన్స్ ఒక్కసారి వస్తే బాగుండని ఎంతోమంది గాయకులు ఎదురు చూస్తే... నాకు మాత్రం ఎన్నో పాటలు ఆయన దగ్గర పాడే అవకాశం వచ్చింది. తమిళంలో ఆయన దగ్గరే ఫస్ట్ పాట పాడాను. రాజాసర్ రికార్డింగ్ రూంలోకి వచ్చేసరికి గాయకులు ఆ పాటను బట్టీ పట్టేయాలి. ఒక్కసారి రికార్డింగ్ మొదలుపెట్టాక... ఒక్క పదం కానీ, స్వరం కానీ తప్పు వచ్చినా సహించరు. అలా ఏకాగ్రతతో, ఏ పొరపాటూ చేయకుండా ఎలా పాడాలో ఆయన దగ్గరే నేర్చుకున్నా. అనుమానాస్పదం, శ్రీరామరాజ్యం, రుద్రమదేవి... ఇలా చాలా సినిమాలు ఆయనతో కలిసి చేసినందుకు గర్వంగా అనిపిస్తుంది.
తమన్... రాజీ పడడు
ఒకప్పుడు నేను మెలొడీ పాటలే పాడగలనని పేరుండేది. అలాంటిది నాచేత ఎన్నో ప్రయోగాలు చేయించి, నాకంటూ ఓ గుర్తింపు తీసుకొచ్చాడు. అభిమానులూ ఆశ్చపోయేలా చేశాడు. మందారా మందారా తరహా మెలొడీ మాత్రమే కాదు, ఏయ్ రాజా, బ్లాక్‌బస్టర్, హే నాయక్, బూచాడే బూచాడే లాంటి క్రేజీ, మాస్ పాటలూ పాడగలిగానంటే దానికి కారణం తమనే. ఏదయినా మాస్‌పాట చెప్పినప్పుడు... ‘నా వల్ల కాదేమో’ అంటే.. ‘మీరు పాడగలరు ట్రై చేయండి’ అని ప్రోత్సహిస్తూ, నా ఆలోచనా విధానాన్నే మార్చేశాడు. అందుకే అతనితో పనిచేయడానికి నేనెప్పుడూ ఇష్టపడతా.
సంజయ్‌లీలా భన్సాలీ... భావాలు పలకాలి
పేరుకు సినిమా దర్శకుడైనా... తన సినిమాల్లో చాలావాటికి సంజయ్‌నే స్వరాలు సమకూర్చారు. ఏ పాటకైనా నేను న్యాయం చేయగలనని నమ్మి తన ప్రతి సినిమాలో ఇప్పటికీ నాకంటూ ఓ పాట కచ్చితంగా ఉండేలా చూస్తున్నారు. పాట ఏదైనా... దానికి తగినట్లుగా రకరకాల భావాలూ, ఉద్వేగాలూ పలికించడం ఆయన్నుంచే నేర్చుకున్నా. దేవదాస్ నుంచి రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్... ఇలా అన్నింట్లో ఎన్నో హిట్స్ పాడాను. తనతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాక నా పాటతీరూ మారింది. పాట భావాన్ని పూర్తిగా అర్థంచేసుకుని పాడటం... తన నుంచే నేర్చుకున్నా. ఈ మెలకువలు ఇతర పాటలు పాడేందుకూ ఉపయోగపడ్డాయి.
ఎ.ఆర్. రెహమాన్... ఓ మ్యాజిక్
పాడకపోయినా ఫరవాలేదు కానీ... రెహమాన్ ఏదయినా పాటకు స్వరం సమకూరుస్తున్నప్పుడు చూసినా చాలనేది నా అభిప్రాయం. నిజానికి రెహమాన్ పాటకు ఓ ఫార్ములా అంటూ ఉండదు. సినిమా విడుదలయ్యేదాకా ఆ పాట ఎలా వస్తుందనేదీ తెలియదు. పాట పూర్తయ్యేలోగా ఎన్నో స్వరాలు మార్చి మార్చి పాడిస్తారు. దాంతో ఏ స్వరమైనా పాడగలమనే నమ్మకం, ఆత్మవిశ్వాసం మాకు వచ్చేస్తుంది. అదిరింది, మామ్, ఐ, 99 సాంగ్స్ సినిమాల్లోని పాటలే కాదు... ప్రేమించే ప్రేమవా, బర్సోరే మేఘా... వంటివీ ఆయన నుంచి వచ్చినవే. ఒక సందర్భానికి కుదిరేట్టుగా ఎన్నో స్వరాలు మార్చడం కష్టమైనా అన్నింటినీ సమన్వయం చేసి ఓ మంచి పాట తీసుకురావడం ఆయనకే చెల్లుతుంది.
మహేశ్ కూతురా మజాకా!
సూపర్‌స్టార్ కృష్ణ ఇంటి నుంచి వచ్చిన మూడోతరం వారసురాలు మహేశ్‌బాబు కూతురు సితార. చిన్నప్పట్నుంచీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిన్నారి అదిరిపోయే స్టెప్పులతో డాన్స్ ఇరగదీస్తుంది. చక్కగా ఇంటర్వ్యూలు చేసేస్తుంది. వెండితెరపైన డబ్బింగ్ చెప్పేస్తుంది. గతేడాది ఓ యూట్యూబ్ ఛానల్‌ని కూడా ప్రారంభించిన ఏడేళ్ల సితూ పాప గురించి చెప్పాలంటే బోలెడు విశేషాలున్నాయి మరి.
చక్రాల కళ్లూ... చూడచక్కని రూపంతో ముద్దొస్తుంటుంది ‘సితూ పాప’ అని మహేశ్‌బాబు ముద్దుగా పిలుచుకునే సితార. ఈ చిన్నారి నోరు తెరిచిందా... మాటల ప్రవాహమే. ఆ గలగలల్లో మనమూ తడిసిముద్దయిపోవాల్సిందే. అంత చక్కగానూ... ఎంతో ఆత్మవిశ్వాసంతోనూ మాట్లాడే సితార ముద్దు ముద్దు మాటలు వినాలంటే... దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ‘ఆద్య అండ్ సితార’ పేరుతో నిర్వహిస్తోన్న యూట్యూబ్ ఛానల్ చూడాల్సిందే. కోటి మందికిపైనే వీక్షిస్తున్న ఈ ఛానల్ ద్వారా సితార, ఆద్యలు పిల్లలకి రకరకాల ఆటలూ, పెయింటింగులూ నేర్పిస్తున్నారు. డూ ఇట్ యువర్స్ెల్ఫ్, క్రాఫ్ట్స్ తయారీతోపాటు సైన్సు ప్రయోగాలు కూడా చేసి చూపుతున్నారు. ఒకే స్కూల్లో కలిసి చదువుకుంటున్న సితార, ఆద్యలు చిన్నప్పట్నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. సెలవులొస్తే కలిసి ఆడుకోవడం, చదువుకోవడంతోపాటు బోలెడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అన్ని కబుర్లనూ తామిద్దరే పంచుకునే బదులు తోటి పిల్లలకీ చెబితే బాగుంటుంది కదా అని ఆలోచించారు. అందుకు యూట్యూబ్ సరైన వేదిక అనుకున్నారు. అలా వాళ్ల ఛానల్‌కి ‘ఆద్య అండ్ సితార’ అనే పేరు పెట్టేశారు. ‘3 మార్కర్స్ ఛాలెంజ్’ పేరుతో గతేడాది ఇద్దరూ కలిసి ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో చిన్నారుల్ని ఆకట్టుకునే బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్యలు పోటీ పడ్డారు. అలా వీడియోల పరంపరను మొదలు పెట్టిన ఈ చిన్నారులు అందుకు తగిన స్క్రిప్టును కూడా వాళ్లే సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మహేశ్‌బాబును ఇంటర్వ్యూ చేసిన వీడియో తెగ వైరల్ అయింది. అందులో సితార, ఆద్యలు ఎంతో చక్కగా, పరిణతితో మహేశ్‌ను ప్రశ్నలు అడగడం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. నటి రష్మికతో కలిసీ ఓ వీడియోలో తెగ సందడి చేశారు.
చురుగ్గా... చలాకీగా
చిన్నప్పట్నుంచీ చాలా చురుకుగా ఉండే సితారకి డాన్స్ అంటే ఎంతో ఇష్టం. నాలుగేళ్ల వయసు నుంచి డాన్స్ నేర్చుకుంటోంది. మహేశ్ పాటలకి ఇరగదీసే స్టెప్పులు వేస్తూ టిక్‌టాక్‌లు కూడా చేస్తోంది. ఈ మధ్య ‘సరిలేరు నీకెవ్వరు’లో ‘ఎవ్వర్ బిఫోర్... నెవ్వర్ ఆఫ్టర్’, ‘అర్ధమవుతోందా’ అనే డైలాగులతో చేసిన వీడియోలు సోషల్‌మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి చేసిన అల్లరి కూడా వైరల్ అయింది. వీటన్నింటితోపాటు సితార డబ్బింగ్ ఆర్టిస్టుగానూ మారిపోయింది. పలు భాషల్లో వచ్చిన డిస్నీ సినిమా ‘ఫ్రోజెన్2’లో చిన్ననాటి ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెప్పింది. ఏడేళ్ల వయసులో ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్న ఈ చిచ్చర పిడుగును చూస్తుంటే ముచ్చటేయట్లేదూ...!
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
General News
Ts Tenth Results: తెలంగాణ ‘పది’ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్‌తో పోరు...ఆశలన్నీ బౌలర్లపైనే..
-
Politics News
Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?
-
Movies News
Amitabh Bachchan: హైదరాబాద్ మెట్రో స్టేషన్లో అమితాబ్.. నెట్టింట ఫొటో చక్కర్లు
-
India News
India Corona: మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. లక్షకు పైగా కరోనా బాధితులు..!
-
General News
Telangana News: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Andhra News: శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం.. ఐదుగురు సజీవదహనం