ఇది బంగారు అయోధ్య!

ఇదో బంగారు లోకం... స్వర్ణకాంతులీనే చిన్ని అయోధ్యా నగరం! రాజస్థాన్‌ అజ్మీర్‌లోని జైన ఆలయం వెనకుంటుందీ పుత్తడి మ్యూజియం. బయట మామూలుగానే ఉన్నా లోపలికి అడుగుపెడితే అణువణువూ స్వర్ణశోభితమే. ముందుగా ఓ పెద్ద హాలు,

Published : 10 Apr 2022 00:21 IST

ఇది బంగారు అయోధ్య!

దో బంగారు లోకం... స్వర్ణకాంతులీనే చిన్ని అయోధ్యా నగరం! రాజస్థాన్‌ అజ్మీర్‌లోని జైన ఆలయం వెనకుంటుందీ పుత్తడి మ్యూజియం. బయట మామూలుగానే ఉన్నా లోపలికి అడుగుపెడితే అణువణువూ స్వర్ణశోభితమే. ముందుగా ఓ పెద్ద హాలు, మధ్యలో ఓ పెద్ద బంగారు కొండ, దాని చుట్టూ చిట్టిపొట్టి పుత్తడి ప్రతిమలూ... అలా ఇక్కడి ప్రతి అణువూ పోతపోసిన బంగారమే కనిపిస్తుంటుంది. అయోధ్య నగరం హిందువులకే కాదు జైనులకీ పుణ్యస్థలమే. జైన తొలి తీర్థంకరుడైన వృషభనాథుడి(ఆదినాథుడు) జన్మస్థలం అదేనన్నది వాళ్ల నమ్మకం. అందుకే 1865లో అజ్మీర్‌లో ఆదినాథుడి ఆలయం ఏర్పాటుచేసేటప్పుడు... ఆయన పుట్టిన అయోధ్యనీ బంగారంతో పునర్నిర్మించాలనుకున్నారు. మొదట ఆలయంలో భాగంగానే దీన్ని ఏర్పాటుచేయాలనుకున్నా... స్థలం సరిపోక వెనకాల మరో రెండంతస్తుల భవనాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. దాన్నే ఇప్పుడు మ్యూజియం అనీ స్వర్ణ అయోధ్య అనీ పిలుస్తున్నారు. ఈ మ్యూజియంలో ఆదినాథుడి జీవిత క్రమాన్ని ఐదు ఘట్టాల్లో(పంచ కల్యాణాలు) వివరించే వందలాది ప్రతిమలు ఉంటాయి. ఆయన జీవితంలో కీలకపాత్ర పోషించిన మేరుపర్వతం నమూనానీ ఏర్పాటుచేశారు. ఆ ప్రతిమలూ, ఈ పర్వతం... అన్నింటికీ బంగారు రేకును తాపడం చేశారు. ఇందుకోసం సుమారు వెయ్యి కిలోల బంగారాన్ని వాడారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..