వాతావరణ కాలుష్యంతో..!

తలనొప్పి, మతిమరుపు, మల్టిపుల్‌ స్ల్కెరోసిస్‌, పార్కిన్‌సన్స్‌ వంటి వ్యాధులకు కారణం వాతావరణ కాలుష్యమే అంటున్నారు అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ నిపుణులు.

Published : 04 Dec 2022 00:02 IST

వాతావరణ కాలుష్యంతో..!

లనొప్పి, మతిమరుపు, మల్టిపుల్‌ స్ల్కెరోసిస్‌, పార్కిన్‌సన్స్‌ వంటి వ్యాధులకు కారణం వాతావరణ కాలుష్యమే అంటున్నారు అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ నిపుణులు. మిగిలినవాటితో పోలిస్తే వాతావరణంలోని మార్పులే పక్షవాతానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు ఇలాగే పెరుగుతూ పోతే ఈ సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయట. ఎందుకంటే గత ముప్ఫై ఏళ్లలో పెరిగిన వాయుకాలుష్యం, ఉష్ణోగ్రతలు... అన్నీ కలిసి నాడీ సమస్యల్ని పెంచాయనీ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే గాల్లోని కలుషితాలు అంటే- నైట్రేట్లూ, పార్టిక్యులేట్‌ మ్యాటర్‌2.5... వంటివాటివల్ల మతిమరుపు, పార్కిన్‌సన్స్‌, తలనొప్పి... వంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. వీటి మోతాదు పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉందనీ, ఇప్పటికైనా జాగ్రత్తపడకపోతే ముందు తరాలకు ముప్పేననీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..