Published : 17 Apr 2022 00:28 IST

ఇది సైకిళ్ల శ్మశానం!

నగరాల్లోనైనా చెత్తకుండీల్లో చెత్త మాత్రమే కనిపిస్తుంది. కానీ చైనాలోని సిటీల్లో మాత్రం చెత్తే కాదు, పాత సైకిళ్లూ ఉంటాయి. అందుకే అక్కడి మున్సిపాలిటీవాళ్లు చెత్తతో పాటూ ఆ సైకిళ్లనూ పట్టుకెళ్లి ‘బైక్‌ గ్రేవ్‌యార్డ్‌’లో పడేస్తారు. ఇదిగో ఇక్కడ గుట్టలు గుట్టలుగా పడి ఉన్న సైకిళ్ల ఫొటోలన్నీ ఆ కుప్పల్లోవే. అసలింతకీ అన్నన్ని సైకిళ్లు ఆ నగరాల వీధుల్లో ఎందుకు ఉంటాయో తెలియాలంటే ఆరేడేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. అప్పట్లో ప్రజలకు రవాణా సౌకర్యాన్నిస్తూ ఎన్నెన్నో సైకిల్‌ షేరింగ్‌ కంపెనీలు పుట్టుకొచ్చాయి. మొబైల్‌ ఆప్‌తో పనిచేసే వీటిల్లో- ఎవరైనా సరే, ఆ నగర పరిధిలోని ఏ ప్రాంతం నుంచైనా సైకిల్‌ను తీసుకుని, అవసరం తీరాక దగ్గరలోని మరో ప్రాంతంలో పార్క్‌ చేసే వీలుండేది. కొంతకాలానికి సైకిళ్లు చాలావరకూ పాడయ్యాయి. రానురానూ ప్రజలు కూడా సైకిళ్లను వాడటం తగ్గించేశారట. దీంతో ఆ కంపెనీలూ మూతపడ్డాయి. పక్కనపడి ఉన్న తమ సైకిళ్లను అలాగే వదిలేశాయి. అలా బస్‌ స్టాపులూ, షాపింగ్‌మాళ్లూ, రైల్వేస్టేషన్లూ, రహదారుల పక్కన దాదాపు రెండు కోట్లకుపైగా సైకిళ్లు పేరుకుపోయాయి. ఇబ్బందిగా మారిన ఆ సైకిళ్ల కోసం ప్రభుత్వం బైక్‌ గ్రేవ్‌యార్డుల పేరుతో కొన్ని స్థలాల్ని ఏర్పాటు చేసి ఇలా డంప్‌ చేస్తోందన్నమాట!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని