Published : 29 Aug 2021 00:43 IST

హహ్హహ్హ

తాగకుండా ఉండాల్సింది!

అత్త: ఇదిగో అమ్మాయ్‌... నేను కడుపుతో ఉన్నప్పుడు ఏమేం తినేదాన్నో ఏమేం తాగేదాన్నో అవన్నీ ఇప్పుడు మా అబ్బాయికి ఇష్టం తెలుసా. నువ్వు కూడా ఆ చిరుతిళ్లు మానేసి మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే, పుట్టబోయే నా మనవడు కూడా అవన్నీ ఇష్టంగా తింటాడు.

కోడలు: అలాగే అత్తయ్యా... ఏది ఏమైనా మీరు కడుపుతో ఉన్నప్పుడు కొంచెం మందూ సిగరెట్లకు దూరంగా ఉండాల్సింది.


ఏం అడిగాను?

రవి: శ్రావణమాసంలో అమ్మాయిలు గుడికి ఎందుకు వెళతారు?

రాఘవ్‌: మంచి మొగుడు దొరకాలని మొక్కుకునేందుకు...

రవి: మరి పెళ్లయినవాళ్లు..?

రాఘవ్‌: ‘నేను అడిగిందేమిటీ... నువ్వు ఇచ్చిందేమిటీ...’ అని నిలదీయడానికి.


శ్రావణమాసం ఆఫర్‌!

భర్తలు భార్యలకు కొనిస్తే కలిగే లాభాలు...

చీరా, నగలూ కొంటే: ఈ జన్మకు

నగలు మాత్రమే కొంటే: మూడు జన్మలకు

పట్టుచీర ఒక్కటే కొంటే: ఏడు జన్మలకు

ఏమీ కొనకపోతే: అన్ని జన్మలకూ ఆమే మీ భార్య. ఇక మీ ఇష్టం.


అందుకే...

భార్య: ఎందుకండీ... మన ప్రయాణాన్ని క్యాన్సిల్‌ చేశారు. అర్జెంటు పని ఏమయినా ఉందా?

భర్త: రాశిఫలాలు ఇప్పుడే చూశా. ఆఖరు నిమిషంలో ప్రయాణం రద్దు అవుతుందని ఉంది. అందుకే క్యాన్సిల్‌ చేశాను.


ఎక్కడ రాసుకోను?

మొదటిసారి ఫ్లైట్‌ ఎక్కిన మహిళ: ఫ్లైట్‌ ఉన్నట్లుండి కూలిపోతే నా ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు?

ఎయిర్‌హోస్టెస్‌: కంగారుపడకండి. మీకేమైనా అయితే వెంటనే ప్యారాచూట్‌ ఇస్తాంలెండి.

మహిళ: ప్రాణాలు పోయే టైంలో కొబ్బరినూనె ఇస్తే ఎక్కడ రాసుకోవాలి???


తెలివితేటలు

‘రాధా రాధా... మన బుజ్జిగాడి మాటలు విన్నావా? చూడు రెండేళ్లకే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో! నా తెలివితేటలన్నీ వీడికి వచ్చాయి’ సంతోషంగా అన్నాడు రమేష్‌. ‘అవును, నిజమే. నా తెలివితేటలన్నీ నా దగ్గరే ఉన్నాయి’ అన్నది రాధ.


నడిచి వెళ్లిపోవచ్చు!

డాక్టర్‌: కరోనా చికిత్స పూర్తవగానే మీరు ఇంటికి నేరుగా నడుస్తూ వెళ్లిపోవచ్చు.

పేషెంట్‌: అంటే ఆటో ఛార్జీకి కూడా డబ్బులు మిగల్చరా డాక్టర్‌?


విషం తాగాడు...

పంకజాన్ని బోనులో నిలబెట్టి లాయర్‌ గట్టిగా అడుగుతున్నాడు.

లాయర్‌: నిజం చెప్పు... నీ భర్త ఎలా చనిపోయాడు.

పంకజం: విషం తాగి చనిపోయాడు.

లాయర్‌: మరి శవం మీద తీవ్ర గాయాలున్నాయి..?

పంకజం: విషం తాగనన్నాడు ముందు...


తెలివి!

ఒకరోజు వెంగళప్ప పెరట్లో తలస్నానం చేస్తూ షాంపూను తలతోపాటు భుజాలకు కూడా రాసుకుంటున్నాడు. అది చూసిన అతని భార్య .

ఏమండీ షాంపూను తలకే రాసుకోవాలి. ఒంటికి కాదు’ అంది.

‘మీ ఆడవాళ్లకి మెదడు మోకాళ్లలో ఉంటుందనేది ఇందుకే. ఏదీ ఓ పట్టాన అర్థం కాదు. ఈ షాంపూ పేరేంటో తెలుసా... హెడ్‌ అండ్‌ షోల్డర్స్‌’ వివరించాడు వెంగళప్ప.


మజా రావట్లే...

భార్య: ఏమండీ.. మీరు అర్జెంటుగా వచ్చి నన్ను ఇక్కడినుంచి తీసుకెళ్లండి...

భర్త: అదేమిటీ.. చాన్నాళ్లకు పుట్టింటికి వెళ్లావు. ఇంకో నాలుగు రోజులు ఉండి రావొచ్చు కదా..

భార్య: ఉహూఁ లేదండీ, ఇక్కడ నాకు బోర్‌గా ఉంది...

భర్త: ఎప్పుడూ ఏదో విషయంలో వాదిస్తూనే ఉంటావు... మీ పుట్టింట్లోనేమో అంతమంది ఉన్నారు... నీకు బోరా...ఆశ్చర్యంగా ఉందే

భార్య: అవును... అన్నా, వదినా, చెల్లీ, అమ్మా నాన్న... ఇలా అందరితో వాదించాను, గొడవపడ్డాను. అదేంటో మీతో గొడవపడినప్పుడు ఉండే మజా వీళ్లతో రావడంలేదు... ఏం చేయమంటారు మరి!Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని